టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నేత రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ పార్టీ అధిష్టానానికి కొలికపూడి 2 రోజుల డెడ్‌లైన్ విధించారు. 48 గంటల్లో సస్పెండ్ చేయకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ అధిష్టానానికి ఆయన అల్టిమేటమ్ విధించారు. గడువు ముగుస్తుండడంతో నెక్ట్స్ ఆయన స్టెప్ ఏంటన్న అంశంపై ఆసక్తి నెలకొంది. మరో వైపు కొలికపూడి వ్యవహారంపై టీడీపీ అధిష్టానం నివేదిక కోరింది. గత 10 నెలల నుంచి జరిగిన ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో చంద్రబాబుకు ఎన్టీఆర్ TDP జిల్లా అధ్యక్షుడు, రీజనల్ కోఆర్డినేటర్, విజయవాడ ఎంపీ రిపోర్టు అందించారు. అయితే-- కొలికపూడి వ్యవహారంపై పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉందని తెలుస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా పద్దతి మారడం లేదని అగ్ర నేతలు అసంతృప్త వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Pawan Vs Varma: పవన్ను ప్రశ్నిస్తూ.. షాకింగ్ వీడియో షేర్ చేసిన వర్మ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!
స్పందించిన ఎంపీ కేశినేని చిన్నీ
ఇదిలా ఉంటే.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీ వెంట కేంద్ర పార్టీ కార్యాలయానికి తిరువూరు మాజీ ఇన్చార్జ్ శావల దేవదత్ రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. తిరువూరు టీడీపీలో కొనసాగుతున్న వివాదాలు పార్టీ కేంద్ర కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్నీ) స్పందించారు. తిరువూరు పంచాయతీని పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. ప్రతీ కుటుంబంలోనూ చిన్నపాటి వివాదాలు సహజం అని అన్నారు.
ఇది కూడా చదవండి: Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మాజీ ఎంపీ హర్షకుమార్ కు పోలీసుల నోటీసులు!
తిరువూరు సమస్యను పార్టీ కుటుంబ సమస్యగా అధిష్టానం కూర్చోపెట్టి పరిష్కరిస్తుంది. తిరువూరు వరుస వివాదాలపై పార్టీ అధిష్టానం నియోజకవర్గంలో అందరి అభిప్రాయాలు ఇప్పటికే సేకరించి నివేదిక రూపొందించిందన్నారు. నివేదిక ఆధారంగా అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
(kolikapudi-srinivasa-rao | telugu-news | telugu breaking news)