/rtv/media/media_files/2025/04/09/ducYkRlKbWCgD7jxqPMw.jpg)
Court Movie
Court Movie: ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో అచ్చం కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటన తెలిసిన వారంతా ‘కోర్టు’ సినిమాను పోలి ఉందంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత ప్రేమించింది. గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే కులాలు వేరు కావడంతో పాటు నిఖిత మైనర్ కావడంతో అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తల్లిదండ్రలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు.
Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్
ఈ క్రమంలోనే నిఖిత గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్తున్నాడు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. “ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు. ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్
అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది..
Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి
Bhuma Akhila: భూమా అఖిల సంచలన సవాల్.. రేపు 4 గంటలకు ఏం జరగబోతోంది?
రేపు 4 గంటలకు తాను డిబేట్ కు సిద్ధమని వైసీపీ నేతలకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల సవాల్ విసిరారు. ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ అన్నారో వాళ్ల ఇంటికే నాలుగు గంటలకు వస్తున్నానన్నారు. దీంతో రేపు ఏం జరగబోతుంది? అనే టెన్షన్ ఆళ్లగడ్డలో నెలకొంది.
ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ సంచలన కామెంట్స్ చేశారు. రేపు 4 గంటలకు తాను డిబేట్ కు సిద్ధమని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ అన్నారో వాళ్ల ఇంటికే నాలుగు గంటలకు వస్తున్నానన్నారు. తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు కలిసి డిబేట్ కు వస్తున్నట్లు చెప్పారు. డిబేట్ ను ఎదుర్కోగలిగితే రేపు సాయంత్రం సిద్ధంగా ఉండాలన్నారు. డిబేట్ కు తాను సిద్ధమని స్పష్టమన్నారు. ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ అన్నారో వాళ్ల ఇంటికే నాలుగు గంటలకు వస్తున్నానన్నారు. ప్రతీ నియోజకవర్గానికి కంపెనీలను తీసుకువచ్చి జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఆళ్లగడ్డలో ఎప్పుడు లేని విధంగా మొదటిసారిగా సోలార్ ప్రాజెక్ట్ తీసుకువచ్చామన్నారు. దాదాపుగా 300 నుంచి 400 మందికి ఉద్యోగాలు ఇప్పించే పరిశ్రమ తెప్పించామమన్నారు. వైసీపీ నాయకులకు ఇవన్నీ కనపడవన్నారు.
ఇది కూడా చదవండి: AP Govt Jobs: 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్!
వాళ్ల ఇళ్ల దగ్గరకు కూడా రోడ్లు..
చంద్రబాబును ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పుడే వైసీపీ పతనం మొదలైందన్నారు. అసలు పరిశ్రమలు అంటే ఏంటో తెలియని వారు కూడా ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో పరిశ్రమలు అంటే చేపలు, కోళ్లు, పీతలు ఇవి మాత్రమేనని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులకు తెలుగు దేశం ప్రభుత్వం చేసే అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామన్నారు.
ఇది కూడా చదవండి: Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు గుడ్ న్యూస్!
వైసీపీ నేతల ఇళ్ల దగ్గరకు కూడా రోడ్డు వేయిస్తామని.. ఇల్లు కట్టిస్తామన్నారు. వైసీపీ నేతలు కూడా మా ప్రభుత్వాన్ని శభాష్ అనేలా చేసి చూపిస్తామన్నారు. భూమా అఖిల ప్రియ సవాల్ నేపథ్యంలో రేపు ఆళ్లగడ్డలో ఏం జరగబోతుందనే అంశంపై హైటెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు సైతం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. రేపు అఖిల ప్రియ డిబేట్ కు వెళ్తారా? వెళ్తే ఏం జరుగుతందనే అంశంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...
ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది..Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!
పవన్ కళ్యాన్ కుమారుడు మార్క్ శంకర్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ సింగపూర్ బయల్దేరనున్నాడు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
Mark’s Health Update : పవన్ కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే...?
సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Instagram loveG: ప్రేమ గుడ్డిది మావా.. ఇన్స్టాగ్రామ్ లవర్ కోసం అమెరికా నుంచి ఆంధ్రా వచ్చిన యువతి
అబ్బాయిదేమో ఆంధ్రప్రదేశ్, అమ్మాయిదేమో అమెరికా. Categories : Short News | Latest News In Telugu | వైరల్
ఏపీకి గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, తిరుపతి మీదుగా తమిళనాడులో వెల్లూరు వరకు రైల్వేలైన్‌లో మరో అదనపు రైల్వేలైన్‌కు శ్రీకారం చుట్టింది. Short News | Latest News In Telugu | నేషనల్
Pavan Kalyan Son: పవన్ తనయుడు ఎలా అయిపోయాడో చూశారా?.. ఫొటోలు వైరల్
పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్ వచ్చింది. మరో మూడు రోజుల పాటు మార్క్ హాస్పిటల్లోనే ఉండనున్నాడు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Ladies Hostels : అర్థరాత్రి దొంగ హల్ చల్ లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి...
Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?
Viral news: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి
Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...
Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!