AP NEWS: విశాఖ జిల్లా గాజువాకలో ప్రేమికుల ఆత్మహత్య కలకలం రేపింది. స్థానికి వివరాల ప్రకారం..షీలానగర్ వెంకటేశ్వర కాలనీలోని ఎస్‌ఎల్ బి నాయక్ ఎంక్లవే అపార్ట్‌మెంట్ మూడో ఫ్లోర్‌లో నూకల సాయి సుస్మిత (25) నివాసం ఉంటుంది. ఓ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. మంగళవారం తెల్లవారుజామున ఏమైందో ఏమో కానీ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తు పైనుంచి దూకి యువ జంట ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. Also Read: రాత్రి పడుకునే ముందు ఇది తింటే అనారోగ్య సమస్యలు ఉండవు అమలాపురానికి చెందిన వారు: ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీయగా.. మృతులను పిల్లి దుర్గారావు, సాయి సుష్మితలుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరూ అమలాపురానికి చెందిన వారని పోలీసుల ప్రాథమిక విచారణ వెల్లడైంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరు కావాలని ఆత్మహత్య చేసుకున్నారా..? లేక మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని అనే దానిపై పోలీసులు ఆరా తీసుకున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Also Read: శీతాకాలంలో ఈ సమయంలోనే విటమిన్ డి లభిస్తుంది