/rtv/media/media_files/2025/02/19/oxmFuy3EFu32dRy6zw7p.jpg)
Srisailam
Srisailam Maha Shivaratri Brahmotsavam: ప్రముఖ శైవక్షేత్రం(Shaivakshetram) శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలకు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా ఆలయాన్ని అలంకరించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో బుధవారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 23న రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ఇది కూడా చదవండి: AP Liquor Scam: మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు!
ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా యాగశాల ప్రవేశం చేసి ఆలయ ఈవో దంపతులు, అర్చకులు ప్రారంభ పూజలను నిర్వహించారు. ఈరోజు ఉదయం 9 గంటలకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు దర్శనం, తాత్కాలిక వసతి, పార్కింగ్ ప్రదేశాలు, ఉచిత అన్నప్రసాదం ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. భక్తులకు ఆర్వో ప్లాంట్ల ద్వారా మంచినీరు, గణేష్ సదన్ ఎదురుగా మినీ కల్యాణకట్ట ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి సత్రాల వరకు ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Also Read: మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు!
ఉత్సవాలు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈనెల 23న మల్లికార్జున స్వామికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసరాలు సమర్పించనున్నారు. 25న కీలక ఘట్టం...పాగాలంకరణ జరుగుతుంది. ప్రముఖులకు 4 విడతలుగా బ్రేక్ దర్శనం కల్పిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు, పాదయాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. కాగా, శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబును దేవదాయశాఖ అధికారులు ఆహ్వానించారు. మంగళవారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, వేదపండితులు ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకుని ఆయనకు బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రిక అందించారు.
Also Read : కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు బిగ్ రిలీఫ్.. ముడా స్కామ్‌లో లోకాయుక్తా క్లీన్ చీట్
మహాశివరాత్రి సందర్బంగా..
మహాశివరాత్రి సందర్బంగా శైవక్షేత్రాలకు భక్తులు క్యూ కడతారు. ముఖ్యంగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి జనం తండోపతండాలుగా తరలివస్తారు. శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఏపీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ నుండి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. రాజమండ్రి నుండి ప్రత్యేక టూరిజం బస్సులు బయలుదేరనున్నాయి. మూడు రోజులపాటు ఏపీ టూరిజం ఆధ్వర్యంలో శ్రీశైలం యాత్ర కొనసాగతుంది. టూరిస్టులను శక్తిపీఠం శ్రీశైలం భ్రమరాంబ టెంపుల్, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం, త్రిపురాంతకేశ్వరి స్వామి టెంపుల్, బాలా త్రిపుర సుందరి దేవి టెంపుల్ల దర్శనం చేపిస్తారు.
Also Read: ఏపీలో వీసీల నియామకం.. యూనివర్సిటీల వారీగా లిస్ట్ ఇదే!
Also Read: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!