YS Jagan : జగన్కు ఎస్‌ఐ వార్నింగ్.. ఏందీ నువ్వు ఊడదీసేది అరటితొక్క!

జగన్ చేసిన కామెంట్స్ పై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కూటమిలోని నేతలను చూసుకుని పోలీసులు రెచ్చిపోతే అధికారంలోకి వచ్చాక బట్టలూడదీసి కొడతామంటూ నిన్న జగన్ చేసిన కామెంట్స్ పై ఎస్‌ఐ సుధాకర్‌ ఓ వీడియో విడుదల చేశారు.  

New Update
jagan-si-sudhakar

jagan-si-sudhakar

ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ పై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కూటమిలోని నేతలను చూసుకుని పోలీసులు రెచ్చిపోతే అధికారంలోకి వచ్చాక బట్టలూడదీసి కొడతామంటూ నిన్న జగన్ చేసిన కామెంట్స్ పై ఎస్‌ఐ సుధాకర్‌ ఓ వీడియో విడుదల చేశారు.  ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ..  ‘జగన్‌.. పోలీసులను బట్టలూడదీసి కొడతానంటున్నారా. పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకున్నారనుకున్నారా? అని ప్రశ్నించారు.  కష్టపడి చదివి, పరుగు పందెల్లో పాసై.. వేలాదిమంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫాం ఇది అని చెప్పుకొచ్చారు.

ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదు

మీరు వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదన్నారు. తాము నిజాయతీగానే ప్రజల పక్షాన నిలబడతామన్న సుధాకర్..   నిజాయతీగానే ఉద్యోగం చేస్తామని, నిజాయతీగానే చస్తాం తప్ప.. అడ్డదారులు తొక్కమని తెలిపారు.  జగన్.. జాగ్రత్తగా మాట్లాడాలి.. జాగ్రత్తగా ఉండాలని ఎస్‌ఐ సుధాకర్‌ హెచ్చరించారు. ఇక  గతనెల మార్చిలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్ధంగానే నడుచుకున్నామని సుధాకర్ తెలిపారు.  జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వందల మంది పోలీసులతో బందోబస్తు కల్పించామని.. అయినప్పటికీ ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని సుధాకర్ ఆ వీడియోలో ఆరోపించారు.

మాజీ సీఎం జగన్ అనుచరులు..  తమ దగ్గర గన్ లు ఉన్నాయని.. ఎవరొస్తారో రండి అంటూ రెచ్చగొడుతున్నారని.. ఇలా కిందిస్థాయి ఉద్యోగులను భయపెడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు సుధాకర్..ఈ విషయంలో ఉద్యోగులకు భరోసా కల్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, హోంమంత్రి, డీజీపీలను ఆయన కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు