/rtv/media/media_files/2025/02/24/12fbx0aHg0hOYnpXfeaW.webp)
SHANKAR NAYAK
State ST Commission : మసాజ్ సెంటర్‌లో అమ్మాయిలతో రాసలీలలు సాగిస్తూ పోలీసులకు పట్టుబడ్డ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, వైసీపీ యువ నాయకుడు వడిత్యా శంకర్ నాయక్ ను పార్టీనుండి బహిష్కరిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ నాయకత్వం ప్రకటన విడుదల చేసింది. వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
Also Read: భారత్‌లో ప్రతీ ఐదుగురిలో ముగ్గురు క్యాన్సర్‌తో మృతి.. సర్వేలో సంచలన విషయాలు
కాగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ విజయవాడ పోలీసులకు మసాజ్ సెంటర్ లో అడ్డంగా దొరికారు. ఆయనతో పాటు 11 మంది విటులు, తొమ్మిది మంది యువతులను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత వారిని స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. ఈ విషయాన్ని మాచవరం సీఐ ఎస్. ప్రకాష్ ధృవీకరించారు. విజయవాడ మసాజ్ సెంటర్ దొరికిన తీరుతో రాయలసీమలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: YCP Kethireddy: సింహాలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సెల్ఫీ.. ఫొటోలు వైరల్!
పోలీసులు ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో దిక్కు తెలియని పరిస్థితిలో కొందరు దొరికిపోయారు. గదిలో నుంచి బయటికి రాలేని స్థితిలో ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్ మంచం కింద నక్కారు. పోలీసుల హెచ్చరికతో శంకర్ నాయక్ వెలుపలికి రావడం కూడా వీడియోలు రికార్డ్ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే స్పా సెంటర్ కు వీటులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా మరో భవన్లో ముగ్గురు యువతులతో కాల్ సెంటర్ కూడా నిర్వహిస్తున్నారనే విషయాన్ని పోలీసులు కూడా గుర్తించారు. రెగ్యులర్ కస్టమర్లు మినహా, కొత్తవారిని ఇక్కడికి అనుమతించేవారు కాదని తెలిసింది. ఇలాంటి ప్రదేశానికి శంకర్ నాయక్ కు అనుమతి లభించడం అనేది ఆసక్తికరంగా మారింది. అంటే ఈ మసాజ్ సెంటర్ నిర్వహణలో ఎవరెవరి పాత్ర ఉందనేది కూడా చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు శంకర్ నాయక్ ఫోన్ అందుబాటులోకి రాలేదు. మసాజ్ సెంటర్ లో పట్టుబడిన తరువాత శంకర్ నాయక్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: భారత్‌లో ప్రతీ ఐదుగురిలో ముగ్గురు క్యాన్సర్‌తో మృతి.. సర్వేలో సంచలన విషయాలు
తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో విద్యార్థి నేతగా జీవితం ప్రారంభించిన వడిత్యా శంకర్ నాయక్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 2020 డిసెంబర్ 25 నుంచి అమల్లోకి వచ్చింది. 2022 ఫిబ్రవరి ఎనిమిదిన మూడేళ్ల కాలపరిమితితో ఎస్టీ కమిషన్ సభ్యుడిగా అనంతపురం జిల్లాకు చెందిన వడిత్యా సోమశంకర్ నాయక్‌ను నియమించారు. ఆయన పదవి ఈ నెల పదో తేదీతో ముగిసింది.
ఇది కూడా చదవండి: SLBC tunnel: 40ఏళ్ల నాటి ఆలోచన ఇంకా ఆచరణలోకి రాలే.. SLBC ప్రాజెక్ట్ హిస్టరీ ఇదే..!!
గిరిజన విద్యార్థి సంఘం సావనీర్ కోసం టీటీడీ అడ్వర్ టైజ్ మెంట్ కోసం చేసిన ప్రయత్నంలో సానుకూల స్పందన లభించలేదు. దీంతో అప్పటి ఈవో ఎల్వీ. సుబ్రమణ్యంపై వడిత్యా శంకర్ నాయక్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు దాఖలు చేశారు. ఇది తీవ్ర కలకలం రేపింది. ఆ తరువాత రెండు పక్షాల మధ్య కుదిరిన రాజీతో కేసు ఉపసంహరణ వెనుక తెరవెనుక కహానీ నడిచినట్లు వ్యాఖ్యానాలు ఉన్నాయి.తిరుపతి నగరం నుంచి విద్యార్థి నేతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన వడిత్యా సోమశంకర్ నాయక్ సాగించిన వ్యవహారాల్లో అనేక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అనేకమంది అధికారులు కూడా ఇబ్బందులు పడ్డారని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అందులో అధికారులు, నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నవారు కూడా బాధితులుగా ఉన్నట్లు సమాచారం.