/rtv/media/media_files/2025/03/04/ndCjYDSMO5tCyjvknuwl.jpg)
Sachivalaya Employee
Sachivalaya Employee: పల్నాడు జిల్లా దాచేపల్లి సచివాలయ ఉద్యోగి పెన్షన్ డబ్బుతో పరారైన విషయం తెలిసిందే. పెన్షనర్లకు ఇవ్వాల్సిన రూ.8.43 లక్షల డబ్బుతో ఉద్యోగి పరారవ్వడంతో పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు స్పందించి పెన్షన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కాగా డబ్బలతో పరారైన వెల్ఫేర్ అసిస్టెంట్ సంపత్ లక్ష్మీ ప్రసాద్ ఈ రోజు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తను ఆన్‌లైన్ బెట్టింగ్‌లో చాలా డబ్బులు పోగొట్టుకున్నానని దీనితో అప్పులయ్యాయని వెళ్లడించాడు. ప్రభుత్వ సొమ్మును వాడుకున్నందుకు తనను క్షమించాలని కోరిన లక్ష్మీ ప్రసాద్ నెలరోజుల్లో ఎలాగైన చేసి మొత్తం డబ్బులను చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. నా తల్లిదండ్రులను బతిమిలాడైనా డబ్బులు తీసుకొస్తానని తెలిపాడు.
ఇది కూడా చూడండి: హైవేపై ఘోర ప్రమాదం.. బైక్ ను తప్పించబోయి బస్సు పల్టీలు.. 36 మందికి గాయాలు!
రెండు రోజులుగా తన భార్యపిల్లలు అన్నం కూడా తినలేదని, అప్పుల మూలంగా ఆత్మహత్య సైతం చేసుకోవాలనుకున్నామని వెల్లడించాడు. తనకు ఒక అవకాశం ఇస్తే మరోసారి ఇలాంటి తప్పు చేయనని కమిషనర్, కలెక్టర్‌ను ఉద్దేశించి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. కాగా వీడితో లక్ష్మీప్రసాద్‌తో పాటు ఆయన భార్య పిల్లలు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది. కాగా లక్ష్మీప్రసాద్ పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
ఇది కూడా చూడండి: Gas cylinder exploded : కూకట్‌పల్లిలో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరికి గాయాలు
అసలేం జరిగిందంటే...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1 తేదీన లబ్ధిదారులకు పెన్షన్ల నగదును అందజేస్తుంది. ఒకటో తేదీన పెన్షన్ ఇచ్చేలా ముందుగానే ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్ అందజేస్తున్నారు.అందులో భాగంగానే మార్చి నెల పెన్షన్లు ఒకటో తేదీన అంటే శనివారం పంపిణీ చేసేందుకు ముందు రోజే (శుక్రవారం) నగదును గ్రామ సచివాలయ ఉద్యోగులకు అందజేశారు. అయితే పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని సచివాలయం-3లో వెల్ఫేర్ అసిస్టెంట్ సంపత్ లక్ష్మీ ప్రసాద్ పెన్షన్ల పంపిణీ కోసం రూ.8.43 లక్షలను తీసుకున్నారు. అయితే శనివారం పంపిణీ చేయాల్సిన ప్రసాద్, ఆ డబ్బులను తీసుకుని పరారయ్యాడు. దీంతో తెల్లవారే డబ్బులు ఇవ్వాల్సిన సిబ్బంది వచ్చి ఇవ్వకపోడంతో పెన్షనర్లకు అనుమానం వచ్చింది. పెన్షనర్లు సచివాలయం వద్దకు వెళ్లి ఆరా తీయగా, పెన్షన్ డబ్బులతో సదరు ఉద్యోగి పరారయినట్లు తెలుసుకున్నారు.
ఇది కూడా చూడండి: World Obesity Day 2025: పెరుగుతున్న ఊబకాయం.. ఈ అలవాట్లు మానకుంటే ప్రమాదాలు తప్పవు!
దీంతో పెన్షనర్లు తమకు పెన్షన్ ఇవ్వాలని సచివాలయ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. దీంతో దాచేపల్లి నగర పంచాయతీ కమిషనర్ అప్పారావు స్పందిస్తూ ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని, అందరికీ పెన్షన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. వారి సచివాలయం పరిధిలో పెన్షనర్లకు కేటాయించిన రూ.34.18 లక్షలను శుక్రవారం విత్‌డ్రా చేశారని, ఆ మొత్తాన్ని పెన్షనర్లకు పంపిణీ చేసేందుకు ఎనిమిది మంది సచివాలయ ఉద్యోగులకు ఆయన ఇవ్వాల్సి ఉందని అన్నారు. అయితే ఆరుగురు సచివాలయ ఉద్యోగులకు మాత్రమే నగదును ఇచ్చాడని, అయితే ప్రసాద్ పంపిణీ చేయాల్సిన నగదును, వేరొక సచివాలయ ఉద్యోగి పంపిణీ చేయాల్సిన నగదు మొత్తం రూ. 8,43,500 ఆయన వద్దనే ఉంచుకున్నాడు.
ఇది కూడా చూడండి: Champions Trophy: మూడు ఓవర్లలో నాలుగు పరుగులు, ఒక వికెట్.. ఆసీస్‌కు చుక్కలు చూపిస్తున్న భారత్
అయితే శనివారం ఉదయం పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉండగా, సచివాలయం-3 పరిధిలోని పంపిణీ జరగటం లేదని తెలిసిందన్నారు. దీంతో తాము సచివాలయం వద్దకు వెళ్లే సరికి, అక్కడ లబ్ధిదారులు ఉన్నారు. ఇంకా పెన్షన్ డబ్బులు ఇచ్చే సిబ్బంది రాలేదని గ్రామస్థులు తెలిపారని కమిషనర్ అన్నారు. వెంటనే ఆ ఉద్యోగికి ఫోన్ చేస్తే, ఫోన్ స్విచ్ఛాప్ వచ్చిందన్నారు. దీంతో ప్రసాద్ నివాసం ఉంటున్న పిడుగురాళ్లకు సిబ్బందిని పంపించామని, అయితే ప్రసాద్ ఇంటి వద్ద కూడా లేడని తెలిపారు. సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామని దాచేపల్లి నగర పంచాయతీ కమిషనర్ అప్పారావు తెలిపారు. ఆయన వద్ద నుంచి మొత్తం నగదును రికవరీ చేస్తామని పోలీసులు తెలిపినట్లు కమిషనర్ తెలిపారు. ఈ వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన ఆదేశాలతో పెన్షన్ దారులకు పెన్షన్ ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా పెన్షన్ డబ్బులతో పరారైన సచివాలయ ఉద్యోగి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సదరు ఉద్యోగిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో లక్ష్మీ ప్రసాద్ సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది.
Also Read : విడదల రజనీపై విచారణ.. అనుమతి కోసం గవర్నర్ కు లేఖ