RTV Exclusive: ఎవరైనా అమ్మ మీద కేసు వేస్తారా?: జగన్ కు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్!

జగన్ తో విభేదాలపై ఆర్టీవీతో షర్మిల ప్రత్యేకంగా మాట్లాడారు. అందరి కుటుంబాలలో సమస్యలు ఉండడం సహజమే అన్న జగన్ కామెంట్స్ కు షర్మిల కౌంటర్ ఇచ్చారు. కుటుంబాల్లో సమస్యలు ఉండడం సహజమే కానీ.. ఇలా అమ్మల మీద, చెల్లెళ్ల మీద కేసులు వేసుకుంటారా? ప్రశ్నించారు.

New Update
Sharmila ys Jagan

YS Sharmila: జగన్ తో విభేదాలపై ఆర్టీవీతో షర్మిల ప్రత్యేకంగా మాట్లాడారు. అందరి కుటుంబాలలో అమ్మల మీద, చెల్లెళ్ల మీద కేసులు వేసుకుంటారా? అని ప్రశ్నించారు. కుటుంబంలో సమస్యలు ఉండడం సహజమేనన్నారు. కానీ అందరూ అమ్మల మీద కోర్టుల్లో కేసులు వేయరు కదా? ఇలా కోర్టుకు లాగరు కదా? అని ప్రశ్నించారు. జగన్ పై లీగల్ ఫైట్ చేస్తారా అనే ప్రశ్నకు షర్మిల సమాధానం చెప్పలేదు.

ఈ రోజు విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా బాధిత కుటుంబాల పరామర్శకు వెళ్లిన జగన్ షర్మిలతో విభేదాలపై స్పందించారు. నిన్న సోషల్ మీడియాలో టీడీపీ విడుదల చేసిన లేఖలపై రియాక్ట్ అయ్యారు. మీ ఇళ్లల్లో ఇలాంటి కుటుంబ గొడవలు లేవా? అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. ప్రతీ ఇంట్లో ఉన్న విషయాలను స్వార్థం కోసం నిజాలు లేకపోయినా పెద్దవి చేసి చూపించడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా ప్రజల సమస్యలపై ధ్యాస పెట్టాలని సూచించారు.  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MLC kavitha : పవన్ అనుకోకుండా డిప్యూటీ సీఎం... ఎమ్మెల్సీ కవిత సంచలనం!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని, ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్  వ్యాఖ్యలపై స్పందనేంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానమిచ్చారు.

New Update
kavitha-pawan

kavitha-pawan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని, ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్  వ్యాఖ్యలపై స్పందనేంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానమిచ్చారు. దురదృష్టవశాత్తూ పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారని..   చేగువేరా ఆదర్శాలు నచ్చిన వ్యక్తి ఇప్పుడు రైటిస్ట్ (బీజేపీ మద్దతుదారు) ఎలా అయ్యారని కవిత ప్రశ్నించారు.  పవన్ కల్యాణ్ చేసే ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయన్న కవిత...   రేపు తమిళనాడు వెళ్లి హిందీ ఇంపోజ్ చేయబోమనైనా ఆయన చెప్పొచ్చు అని ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

పవన్ కల్యాణ్ అభిమానులు ఫైర్!  

అయితే కవిత కామెంట్స్ పై జనసేన నేతలు, పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఊతికారేస్తున్నారు.  కవితకు ఏ అర్హత ఉందని పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. గతంలో లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టైన విషయాన్ని గుర్తుచేస్తూ ఇలాంటి స్కామ్ లు చేస్తేనే  సీరియస్ పొలిటీషియన్ అన్నట్లా అంటూ కౌంటర్ ఇస్తున్నారు.  

Also read : కాంగ్రెస్ అంతరించిపోతున్న జాతి.. రేవంత్కు బండి సంజయ్ కౌంటర్

Advertisment
Advertisment
Advertisment