Dana Cyclone: దూసుకొస్తున్న దానా..బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం! బంగాళాఖాతంలో తీవ్ర తుపాను దానా ముప్పు పొంచి ఉంది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయానికి తుపానుగా , గురువారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మరే అవకాశాలున్నాయని ఐఎండీ పేర్కొంది. By Bhavana 23 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ వాతావరణం New Update షేర్ చేయండి Dana Cyclone: బంగాళాఖాతంలో తీవ్ర తుపాను దానా ముప్పు పొంచి ఉండటంతో ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలను భారత వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. బుధవారం ఉదయానికి తుపానుగా , గురువారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మరే అవకాశాలున్నాయని ఐఎండీ పేర్కొంది. Also Read: రాష్ట్రవ్యాప్తంగా 162 మంది ఏఈవోల సస్పెన్షన్! సాగర్ ద్వీపం మధ్యలో తీరం... గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం ఉదయంలోగా పూరీ, సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటొచ్చని భావిస్తోంది. తుపాను ప్రభావం ఏపీ పై అంతగా ఉండకపోవచ్చు. ప్రస్తుత అంచనా ప్రకారం ఒడిశా, పశ్చిమబెంగాల్ స్థానిక పరిస్థితుల వల్ల వాయుగుండం గమనం మార్చుకుంటే బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశాలున్నాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. Also Read: ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు.. కొనసాగుతోన్న వాయుగుండం దీని గురించి బుధవారం నాటికి పూర్తి స్పష్టత వస్తుంది అని ఐఎండీ మాజీ డీజీ కేజే రమేష్ తెలిపారు. బంగాళాఖాతంలో వాయుగుండం నుంచి తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుంది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. Also Read: మరింత తగ్గిన Group-1 హాజరు శాతం.. నేడు ఎంత మంది ఎగ్జామ్ రాశారంటే? దానా తుపాను హెచ్చరికల నేపథ్యంలో 23,24, 25 తేదీల్లో కోస్తా రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. వాటిలో దూర ప్రాంత సర్వీసులు సహా దగ్గర సర్వీసులు ఉన్నాయి. గురువారం అత్యధికంగా 37 సర్వీసులు రద్దయ్యాయి. రద్దయిన రైళ్లలో ఎక్కువగా హావ్ డా, భువనేశ్వర్ ఖరగ్‌పూర్ పూరీ తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించేవి ఉన్నాయి. విశాఖ- భువనేశ్వర్ మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ రైలును 24 న రద్దు చేశారు. Also Read: అమిత్‌షాకు కోల్‌కతా జూ.డాక్టర్ తండ్రి లేఖ.. ఏం చెప్పారంటే ? మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి