అలేఖ్య చిట్టిపికెల్స్ వ్యవహారం సోషల్ మీడియాలో ఘాటుగా మంటెక్కిపోతుంది. ఇదెంటండి.. మీ పచ్చడి రేట్లు ఇంత ఎక్కువగా ఉన్నాయి అని అడిగినందుకు ఆ పచ్చళ్ల వ్యాపారి యజమాని అయిన ఓ మహిళ కస్టమర్‌పై బూతులతో రెచ్చిపోయింది. ఇంత రేటు పెట్టి పచ్చళ్లే కొనలేకపోతే.. రేపు పెళ్లిచేసుకుని నీ పెళ్లాన్ని ఏం పోషిస్తావ్. నీకు ఓ లవర్ గాని పెళ్లం గాని ఉంటే వాళ్లు అడిగినవి నువ్వ కొనలేవు కాబట్టి వాళ్లు వెంటనే నిన్ను వదిలేస్తారు.
Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?
ముస్టి పచ్చడే కొనలేకపోతున్నావ్.. గోల్డ్ ఏం కొనిస్తావ్‌రా ల*** కొడకా అంటూ ఆ కస్టమర్‌పై బూతులతో చెలరేగిపోయింది. ఇప్పుడా ఆడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. ఈ క్రమంలో మరో ఆడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ యువతి మీ పచ్చళ్లు ఎందుకు ఇంత ఎక్కువ రేటు ఉన్నాయని అడగ్గా.. ఆమెపై కూడా పచ్చళ్ల యజమాని బూతులతో రెచ్చిపోయింది.
Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
పాచిపనులు చేసుకో
‘‘ఒసెయ్ పిచ్చి ముఖందానా ఈ తక్కువ ప్రైజ్‌లను కూడా నువ్ భరించలేను.. హై కాస్ట్.. టూ మచ్ కాస్ట్ అంటున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్‌లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాట విని నాలుగు ఇళ్లల్లో పాచిపని చేసుకుని బతుక్కో వెళ్లు’’ అంటూ నోటికి అడ్డు అదుపు లేకుండా బూతులతో మాట్లాడింది. ఇప్పుడీ ఆడియో సైతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!
ఓ యువడికి దారుణంగా తిట్లు
పాములు పట్టేవాడు పాముకాటుకే బలైపోయినట్లు.. సోషల్ మీడియాలో ట్రోల్స్ వల్ల పెరిగిన బిజినెస్, ఇప్పుడు అదే సోషల్ మీడియా ట్రోల్స్ దెబ్బకు మూతపడటానికి వచ్చింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లకు అలేఖ్యచిట్టి పికిల్స్ అనే పచ్చళ్ల బిజినెస్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పుణ్యమా అంటూ ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి పచ్చళ్ల బిజినెస్‌ను బాగా ప్రమోట్ చేసుకున్నారు. ఆర్డర్ల కోసం ఆన్‌లైన్‌లో డెలివరీలు కూడా స్టార్ట్ చేశారు. రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా సోషల్ మీడియాలోనే అలేఖ్యచిట్టిపికిల్స్ అనే పేరును ఫుల్ వైరల్ చేశారు. ఓ కస్టమర్ పచ్చళ్ల కోసం వాట్సాప్ నెంబర్‌ను సంప్రదించాడు. అలేఖ్యచిట్టి పికిల్స్ రేట్లు వారు పంపించారు. పికిల్స్ ధరలు చూసిన కస్టమర్.. మీరు చాలా ఎక్కువ రేటుకు ఎందుకు అమ్ముతున్నారని అడిగాడు.
దీంతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఓ యువతి కస్టమర్‌పై బూతులతో రెచ్చిపోయింది. వాట్సాప్‌లో బూతులు తిడుతూ ఆడియో మెస్సేజ్ పంపించింది. ఇంత రేటు పెట్టి పచ్చళ్లు కొనలేని నీదీ ఓ బతుకేనా అంటూ నీచంగా మాట్లాడింది. నీ లాంటి వాళ్లు లైఫ్‌లో బాగా సెటిల్ అయ్యాకే.. పెళ్లి చేసుకోవాలని పర్సనల్ విషయాలను టార్గెట్ చేస్తూ కస్టమర్‌ను ఆడిపోసుకుంది. నానా బూతులు తిట్టింది. అది విన్న కస్టమర్ ఆమె వాట్సాప్ ఆడియో మెస్సేజ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా
తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. పచ్చళ్లు ఎందుకు అంత రేటు ఎక్కువ ఉన్నాయంటే.. ఇష్టముంటే కొను, లేదంటే మానుకో అనాలి. లేదా మా పచ్చళ్లు ఇంతే అని చెప్పాలి. కానీ అమ్మానా బూతులు తిట్టడం ఏంటి అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీంతో అలేఖ్యచిట్టిపికిల్స్ పచ్చళ్లు కొనొద్దని ఇంటర్‌నెట్‌లో ప్రచారం జరుగుతుంది. అక్కచెల్లెళ్లుకు ఇంత నోటిదూల ఎందుకని యూజర్లు మండిపడుతున్నారు. దీంతో అలేఖ్యచిటిపికిల్స్ సేల్స్ పడిపోతున్నాయి. ఆ పికిల్స్ కొనాలనుకునే వారు కూడా వాళ్ల బూతుపురాణం విని వెనక్కి తగ్గుతున్నారు. గతరెండు మూడు రోజులుగా సోషల్ మీడియా మొత్తంలో అలేఖ్యచిట్టిపికిల్స్ వాళ్లు కస్టమర్‌ను తిట్టిన వీడియోలే ట్రోల్ అవుతున్నాయి.
(Alekhya Chitti Pickles | latest-telugu-news | telugu-news | viral-news)