/rtv/media/media_files/2025/03/03/r2zJ0o1FINpkqV5umyGt.jpg)
నటుడు పోసాని కృష్ణమురళికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయన్ను నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుత రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసానిపై పీటీ వారెంట్ ఇచ్చారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి నరసరావుపేట కోర్టులో హాజరు పరచనున్నారు పోలీసులు. నరసరావుపేట టూ టౌన్ సీఐ హేమారావు ఆధ్వర్యంలో పోసానిని నరసరావుపేటకు తరలిస్తున్నారు పోలీసులు.
పోసానిపై 15కు పైగా కేసులు
డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని నరసరావుపేట పోలీసులకు జనసేన నేతల ఫిర్యాదు చేయడంపై బీఎన్ ఎస్ యాక్ట్ 153-ఎ, 504, 67 ఐటీ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. కాగా రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 15కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో పోసాని లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
కాగా కూటమిలోని కీలక నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్,లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఇప్పటికే రాజంపేట పోలీసులు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కడప కోర్టులో పోసాని తరుపున ఆయన లాయర్లు ఇవ్వాళ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
అస్వస్థతకు గురయ్యారని వార్తలు
పోసాని కృష్ణమురళి ఇటీవల అస్వస్థతకు గురయ్యారని వార్తలు వచ్చాయి. అయితే పోసాని అనారోగ్యంతో బాధపడడం ఒక డ్రామా అని అన్నారు రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు. ఉదయం నుంచి పోసాని అనారోగ్యమంటూ నాటకం ఆడారని తెలిపారు. పోసాని అడిగిన అన్ని టెస్టులు తాము చేయించామని అన్నారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రితో పాటుగా కడప రిమ్స్‌లో కూడా పరీక్షలు చేయించామని తెలిపారు. పోసానికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. దీంతో రిమ్స్ నుంచి తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలించామని వెల్లడించారు.
జోగినేని మణి ఫిర్యాదు మేరకు
కాగా జనసేన నాయకుడు జోగినేని మణి (Jogineni Mani) 2025 ఫిబ్రవరి 24వ తేదీన పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోసానిపై 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి26వ తేదీన హైదరాబాద్‌లో ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేసి అక్కడినుంచి పోసానిని ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Also Read : డేంజరస్ కెమికల్స్‌తో పాల తయారీ.. కల్తీని ఇలా కనిపెట్టండి..!