/rtv/media/media_files/2024/11/15/F7eobRGKF62wJ5dazIwH.jpg)
ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఇటీవల ఆయన్ని అరెస్టు చేశారు. ఈ క్రమంలో రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కులాలు, వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పోసాని వాంగ్మూలంలో తెలిపారు.
ఇది కూడా చూడండి: TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు.. నిరుద్యోగ యువతకు చైర్మెన్ అదిరిపోయే శుభవార్త!
స్క్రిప్ట్ ప్రకారమే చేశానని..
పవన్ కళ్యాణ్, లోకేశ్ కుటుంబ సభ్యులను దూషించినట్లు ఒప్పకోవడంతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్లు తెలిపారు. సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే విమర్శలు చేశానని, కావాలనే పవన్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టానని పోసాని వెల్లడించారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఉంటూ వైసీపీకి సపోర్ట్ చేశానని పోసాని పోలీసులకు తెలిపారు. పవన్‌ను వ్యక్తిగతంగా దూషించడం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతితోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాట్లాడిన మాటలు అన్ని కూడా సజ్జల కొడుకు భార్గవరెడ్డి సోషల్ మీడియాల్లో వైరల్ చేసేవాడని పోసాని రిమాండ్‌లో వెల్లడించారు.
ఇది కూడా చూడండి: హైదరాబాద్‌కు AICC ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. ముందున్న సవాళ్లు ఇవే..!
ఇదిలా ఉండగా కులాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య గొడవలు, పవన్, లోకేశ్ కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇటీవల రాయచోటి పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని కోర్టులో హాజరు పరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో మార్చి 13వ తేదీ వరకు రిమాండ్‌లో ఉండనున్నారు. అయితే ప్రస్తుతం రాజంపేట సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా పోసాని కృష్ణమురళి ఉన్నారు. ఆయనకు ఖైదీ నంబర్ 226 కేటాయించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు