/rtv/media/media_files/2025/03/03/r2zJ0o1FINpkqV5umyGt.jpg)
సినీ నటుడు, వైసీపీ లీడర్ పోసాని కృష్ణ మురళి బెయిల్‌పై విడుదల అయ్యారు. గుంటూరు జైలు నుంచి శనివారం ఆయన్ని రిలీస్ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పోలీస్ కేసు నమోదైంది. సీఐడీ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటివరకు పలువురిని దూషించిన, ఇతర విషయాల్లో ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు ఫైల్ అయ్యాయి. గుంటూరు జైలు నుంచి పోసాని బయటకు వచ్చాక తీవ్ర భావోద్వేగానికి గురైయ్యారు. ఆయన్ని వైసీపీ నేతలు ఓదార్చారు. ఆయనకు రూ.లక్ష పూచీకత్తుతో పాటు దేశం విడిచి వెళ్లరాదని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు.
Also read: AI Grok: తిడితే నవ్వుతున్నాడేంటి.. గ్రోక్ బూతు రిప్లేలపై ఎలన్ మస్క్ రియాక్షన్ ఇదే
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జైలు అధికారులు కోర్టు ఆర్డర్ కాపీలు పరిశీలించి శనివారం సాయంత్రం ఆయన్ని విడుదల చేశారు. ఫిబ్రవరి 26న పోసాని కృష్ణ మురళి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ అయ్యారు.