అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం మూడు రోజుల నుంచి రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఈ కాంట్రవర్సీ మరింత ముదిరిన నేపథ్యంలో అక్కా చెల్లెల్లు సుమ, అలేఖ్య, రమ్య వెనక్కి తగ్గారు. ఈ మేరకు అలేఖ్య చేసిన తప్పుకు ముగ్గురూ క్షమాపణలు చెప్పారు. ఈ వివాదంలో ఘోరమైన ట్రోల్స్, విమర్శలకు గురైన అలేఖ్య చిట్టి ప్రస్తుతం హాస్పిటల్‌లో ఐసీయూలో ఉంది. అలేఖ్య తీవ్ర అనారోగ్యం బారిన పడిందని.. ఆమె ప్రస్తుతం ఐసీయూలో ఉందని ఆమె సిస్టర్ చెప్పుకొచ్చిన ఆడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
ఇక ఈ వివాదం జరగడంతో వారు తమ పచ్చళ్ల బిజినెస్‌ను ఆపేశారు. అయితే ఆ బిజినెస్‌కు బ్రేక్ ఇచ్చి మరొక కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని తాజాగా ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ తెలిపాడు. ఈ మేరకు అలేఖ్య వివాదంపై అతడు స్పందించాడు. అలేఖ్య బూతులు మాట్లాడటం చాలా తప్పేనని అన్నాడు. వారి ముగ్గురిని తాను చెల్లెల్లుగా భావిస్తున్నానని.. దయచేసి వారిని క్షమించండి అని కోరాడు.
ఇది కూడా చూడండి: వాట్సాప్ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
కొత్త బిజినెస్‌లోకి అలేఖ్య చిట్టి
అంతేకాకుండా ప్రస్తుతం వారి పచ్చళ్ల బిజినెస్ పూర్తిగా మూతపడిపోయిందని చెప్పుకొచ్చాడు. అందువల్ల త్వరలో వారు మరొక కొత్త వ్యాపారం ప్రారంభించబోతున్నట్లు తెలిపాడు.ఇక నుంచి అలేఖ్య పికిల్స్ బిజినెస్ తీసేసి త్వరలో రమ్య పేరుతో లడ్డూ వ్యాపారం చేయబోతున్నారని అన్నాడు.
ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ
పూతరేకులు, లడ్డూలు, స్వీట్స్ వంటివి తయారు చేస్తారని తెలిపాడు. రేటు ఎక్కువగా ఉన్నా.. వీళ్లు క్వాలిటీ మెయింటైన్ చేస్తారని చెప్పుకొచ్చాడు. అందువల్ల వీళ్లని వదిలేయండని.. అయిపోయిందేదో అయిపోయింది.. క్షమాపణలు కూడా చెప్పారని పేర్కొన్నాడు. దీనిబట్టి చూస్తే ఇకపై అలేఖ్య పేరుతో కాకుండా రమ్య పేరుతో ఈ లడ్డూ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి
(alekhyaa chitti pickle | alekhya chitti pickles controversy | latest-telugu-news | telugu-news | naa anveshana)