ఒంగోలు Rains in AP, Telangana: అల్పపీనడం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు! బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు హైదరాబాద్‌పై వానదేవుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ వాగులో కూరగాయల వ్యాపారి షేక్ మహ్మద్ ఖాసీం నీట మునిగి మృతి చెందాడు. By Trinath 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Dola Bala Veeranjaneya Swamy: ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి హౌస్ అరెస్ట్.. పోలీసులపై ఎమ్మెల్యే సీరియస్!! ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ డోల బాల వీరాంజనేయస్వామిని పోలీసులు హౌస్ అరెస్ట్ అడ్డుకున్నారు. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇసుక సత్యాగ్రహం మూడవ రోజు బుధవారం విజయవాడలో మైనింగ్ కమిషనర్ కార్యాలయంల దగ్గర ధర్నాలో పాల్గొంటారన్న సమాచారంలో.. ముందస్తుగా పోలీసులు ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చీటికి మాటికీ మా ఇంటికి వచ్చి ఇబ్బందులు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్న మమ్మల్ని ఇలా అడ్డుకోవడం మంచి పద్దతి కాదని అన్నారు. By E. Chinni 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident at Prakasam District: ప్రకాశం జిల్లాలో లారీ-బైక్ ఢీ.. ముగ్గురు స్పాట్ డెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ఓ లారీ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఎర్రగొండపాలెంలో ఓ ఎంగేజ్ మెంట్ కి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న సమయంలో తర్లుపాడు మండలం వద్ద కలుజువ్వల పాడు వద్ద లారీ, బైక్ ఢీ కొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదం తర్లుపాడు మండలం కలుజువ్వల పాడులో జరిగింది. By E. Chinni 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. యువకుడి ఇంటిపై తల్లిదండ్రుల దాడి ప్రకాశం జిల్లాలో దర్శి మండలం బొట్లపాలెంకి చెందిన ఓ యువకుడు.. అదే గ్రామానికి చెందిన బ్రహ్మారెడ్డి, అతని భార్య పుల్లమ్మ కూతురు గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోక పోవడంతో.. ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లి పోయి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు బ్రహ్మారెడ్డి, పుల్లమ్మ యువకుడి కుటుంబ సభ్యులకు దాడికి పాల్పడ్డారు. తల్లిని కొట్టి, ఆ తర్వాత సోదరి బట్టలు చింపి అమానుషంగా పెట్రోల్ పోసి.. చంపేస్తామని బెదిరించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై యువకుడి బంధువులు, స్థానికులు కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు నిందితులు బ్రహ్మారెడ్డి, అతని భార్య పుల్లమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యాయత్నం, కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. By E. Chinni 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఒంగోలు సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారు: బాలినేని మాజీ మంత్రి, ఉమ్మడి ప్రకాశం జిల్లా సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడనున్నారా? సీఎం జగన్‌కు దగ్గరి బంధువైన ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం ఎందుకు జరుగుతోంది? ఈ వార్తలపై బాలినేని ఎలా స్పందించారు? By BalaMurali Krishna 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ VRO caught by ACB Officials: రైతుల వద్ద లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని యేరువారిపల్లి గ్రామ వీఆర్వో వేణు గోపాల్.. ఏసీబీ అధికారులు పన్నిన వలలో చిక్కారు. రైతుల వద్ద నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పేరంగూడిపల్లికి చెందిన వలంటీర్ వీరం రెడ్డి భాస్కర్ రెడ్డి.. తన తండ్రి లక్ష్మిరెడ్డికి ఉన్న 2.73 ఎకరాల భూమిని మ్యూటేషన్ చేయాలని వీఆర్వో వేణుగోపాల్ రెడ్డిని సంప్రదించారు. అయితే ఇందుకు వీఆర్వో వేణుగోపాల్ రెడ్డి రూ.30 వేలు లంచం డిమండ్ చేశారు. దీంతో వీరం రెడ్డి భాస్కర్ రెడ్డి రూ.21 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం భాస్కర్ రెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వీఆర్వో వేణుగోపాల్ రెడ్డతో వీరం రెడ్డి భాస్కర్ రెడ్డి చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.21 వేలు అందిస్తుండగా.. అక్కడే మారు వేషంలో ఉన్న ఏసీబీ అధికారులు వీర్వోను రెడ్ హ్యాండెడ్ గా పట్టకున్నారు. By E. Chinni 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఒంగోలు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ లు ఉత్సవ విగ్రహాలుగా మారారు! సర్పంచ్‌లకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడటంపై బీజేపీ మహాధర్నాకు దిగింది. తిరుపతిలో బీజేపీ మహాధర్నాలో జనసేన నేతలు పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత మొట్ట మొదటిసారి బీజేపీతో కలిసి నిరసనలో జనసేన పాల్గొంంది. By Bhavana 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పాదయాత్రలో నారా లోకేశ్‌కు తప్పిన పెద్ద ప్రమాదం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. దర్శి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఒక్కసారిగా మీద పడటంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. By BalaMurali Krishna 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గ్రానైట్ పరిశ్రమను జగన్ నాశనం చేశాడు..! యువగళం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పలు ప్రజాసంఘాలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు.అందులో భాగంగా ప్రకాశంజిల్లా ఒంగోలులో గ్రానైట్ రంగం ప్రతినిధులతో మాట్లాడి పలు సమస్యలు తెలుసుకున్నారు. జగన్ పాలనలో గ్రానైట్ పరిశ్రమ నాశనం అయ్యిందన్నారు. టీడీపీ పాలనలో గ్రానైట్‌ని ఇండస్ట్రీగా గుర్తించి వాటికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చిందని లోకేశ్ తెలిపారు.టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ గ్రానైట్ పరిశ్రమను వేధించలేదని తెలిపారు. జగన్ గ్రానైట్ పరిశ్రమను మోసం చేసి సంక్షోభంలోకి నెట్టేశారని లోకేశ్ విమర్శించారు. By V. Sai Krishna 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn