/rtv/media/media_files/2024/11/27/R16mQ4MlpCdbysptJUfx.webp)
ongole crime
ongole crime: కన్న ప్రేమను మర్చిపోయి కూతురి పట్ల కర్కసంగా ప్రవర్తించాడు ఓ మానవత్వం లేని తండ్రి. అనుమానంతో కూతురికి యాసిడ్ తాగించాడు. ఈ అమానవీయ ఘటన ఒంగోలు జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read: నా అసలు పేరు అదికాదు.. ఆ ఇన్సిడెంట్ తో పేరు మార్చుకున్నా : రెజీనా కసాండ్రా
భార్య పై అనుమానంతో
భాస్కర్ రావు, లక్ష్మీ దంపతులు కరవది సమీపంలో రొయ్యల చెరువుల్లో పని చేసుకోవడానికి పాడేరు నుంచి ఒంగోలుకి వచ్చారు. అయితే భాస్కర్ రావు భార్య పై అనుమానంతో కూతురు తనకు పుట్టలేదని దారుణానికి ఒడిగట్టాడు. కనీస మానవత్వం మర్చిపోయి కూతురి చంపాలని అనుకున్నాడు. భార్య లక్ష్మి ఇంట్లో లేని సమయం చూసి పాపకు యాసిడ్ తాగించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే పాపను ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు.
Also Read: యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్