AP Crime: దాచుకున్న పెన్షన్ డబ్బే...అంత్యక్రియలకు ఆసరా అయ్యింది

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తిలో కురందాసు సత్యవతి (84) శనివారం పింఛన్ డబ్బులు తీసుకుంది. కొద్ది నిమిషాలకే ఆమె మృతి చెందారు 4 వేల పింఛనుతో వృద్ధురాలి సత్యవతికి గౌరవంగా అంతిమ యాత్రను గ్రామస్థులు నిర్వహించారు.

New Update
CM Jagan: పెన్షన్ రూ.5000లకు పెంపు!

AP News

AP crime:  ఆసరా పింఛనే ఆమె అంత్యక్రియలకు అక్కరకు వచ్చింది. అనాథగా మిగిలిన ఆ వృద్ధురాలిని ఆ డబ్బే కాటికి చేర్చడానికి అవసరం పడింది. కన్నవారి, తోడబుట్టినవారు కనికరించని చోట ప్రభుత్వం అందించిన ఆ నాలుగు వేలు నలుగురు పాడే మోసేలా చేసింది. ఈ విషాదకర ఘటన ఏపీలోని  కాకినాడ జిల్లా  చోటుచేసుంది.

ముందుగా అదుకున్న పింఛన్ డబ్బులు:

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాద ఘటన జరిగింది. పింఛన్ డబ్బులు తీసుకున్న ఓ వృద్ధురాలు కొద్ది నిమిషాలకే తుది శ్వాస విడిచింది. ఈ ఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కురందాసు సత్యవతి (84) శనివారం ఉదయం పింఛన్ డబ్బులు తీసుకుంది. కొద్ది నిమిషాలకే ఆమె మృతి చెందారు.

Also Read: చలికాలంలో ఇండోర్‌ మొక్కలని ఇలా రక్షించుకోండి

1వ తేదీన ఇచ్చి ఉంటే పింఛన్ తీసుకునే అవకాశమే ఆమెకు ఉండేది కాదని బంధువులు పేర్కొన్నారు. సత్యవతి పొందిన పింఛన్‌ డబ్బులతో అంత్యక్రియలు చేశారు. ఈ రోజు ఆదివారం కావడంతో కూటమి ప్రభుత్వం ముందుగా ఇచ్చిన రూ.4000 పింఛనుతో వృద్ధురాలి సత్యవతికి గౌరవంగా అంతిమ యాత్రను గ్రామస్థులు నిర్వహించారు. ప్రభుత్వం ముందుగా పింఛన్ అందించినందుకు గ్రామస్థులు కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: బెండకాయతో పొరపాటున ఇవి తినకండి

ఏపీలోని కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉండే విధంగా అభివృద్ధి ఫలాలను సంక్షేమంగా తిరిగి ప్రజలకు చేర్చుతోంది. పింఛన్ల పంపిణీలో అవినీతి ఉండకూడదని సీఎం చంద్రబాబు ఇంతకు ముందే స్పష్టం  చేసిన విషయం తెలిసిందే. ఆ దిశగానే ప్రభుత్వం డిసెంబర్ 1వ తేదీ ఆదివారం రావటంతో పింఛన్లను ఒకరోజూ ముందుగానే (శనివారం) ఇచ్చేలా ప్లాన్ చేసింది. ప్రజల మద్దతుతో రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వం కష్టపడి సంపదని పెంచి.. సంక్షేమం రూపంలో పేదలకు పంచుతామని సీఎం చెబుతున్నారు.

Also Read:  చలికాలంలో ఇండోర్‌ మొక్కలని ఇలా రక్షించుకోండి

Also Read: చవకగా బరువు తగ్గించుకోండి...వేగంగా కొవ్వు కరుగుతుంది

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు