ట్రాన్స్‌జెండర్ హత్య కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన ఎస్పీ

నెల్లూరు జిల్లాలో కలకలం సృష్టించిన ట్రాన్స్ జెండర్ హాసినీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హిజ్రా నాయకులు హాసిని, అలేఖ్యల మధ్య గొడవలే హత్యకు కారణమని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. హత్య కేసులో 15 మంది ప్రమేయం ఉందని అన్నారు.

New Update
transgender  murder

ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఇటీవల దారుణ హత్య జరిగింది. ట్రాన్స్‌జెండర్ల నాయకురాలు అయిన హాసినిని గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా నరికి హత్య చేశారు. దీంతో నెల్లూరు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఒక హిజ్రాను ఇంత దారుణంగా హతమార్చడం వెనుక ఎవరున్నారు అనేది సస్పెన్స్‌గా ఉండేది. తాజాగా ఆ సస్పెన్స్‌కు పోలీసులు ముగింపు పలికారు. ట్రాన్స్‌జెండర్ హాసిని హత్య కేసును తాజాగా పోలీసులు ఛేదించారు. 

ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పూర్తి వివరాలు వెల్లడించారు. ట్రాన్స్‌జెండర్ల నాయకులు హాసిని, అలేఖ్యల మధ్య ఆధిపత్యపోరే హత్యకు కారణమని ఆయన తెలిపారు. ఈ హత్య కేసులో దాదాపు 15 మంది ప్రమేయం ఉందని పేర్కొన్నారు. అందులో 12 మందిని అరెస్ట్ చేశామని.. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. హాసిని, అలేఖ్యల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని.. వీరిపై నెల్లూరు సహా తిరుపతిలో కూడా పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు. 

Also Read: చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. రూ.200 లకే 90 రోజుల వ్యాలిడిటీ!

అయితే హాసినికి ఒక్క అలేఖ్యతోనే కాకుండా సులోచన, షీలా అనే ట్రాన్స్‌జెంటర్‌లతోనూ గొడవలు పడిందని తెలిపారు. దీంతో వీరంతా ఒక్కటై మరికొందరి సహాయంతో హాసినిని హత్య చేయించారని పేర్కొన్నారు. కొడవలూరు మండలం టపాతోపు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఈ నెల 26న దారుణంగా హత్య చేయించారని తెలిపారు. అయితే ఈ హత్యలో పాల్గొన్న నిందితులంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారేనని.. వారిని సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించామని పేర్కొన్నారు. 

Also Read: ICC ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జైషా..

ఏం జరిగింది?

నెల్లూరులోని దీనదయాళ్‌నగర్‌కు చెందిన హాసిని కొన్ని రోజులుగా తిరుపతి శివారు మంగళం ప్రాంతంలో నివసిస్తోంది. ఈమెకు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బలమైన వర్గముంది. విడవలూరు మండలం పార్లపల్లి సమీపంలో మహాలక్ష్మమ్మ ఆలయ పునర్నిర్మాణానికి ఆమె శ్రీకారం చుట్టి కొంతమేరకు పనులు చేయించింది. ఈ క్రమంలో మంగళవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది.

Also Read: సూపర్ బైక్.. లీటర్ పెట్రోల్‌తో 70 కి.మీ మైలేజ్, ధర చాలా తక్కువ!

ఆమెతోపాటు సహచర హిజ్రాలు పాల్గొని పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో హాసిని కారులో నెల్లూరుకు బయలుదేరింది. టపాతోపు రైల్వే గేటు అండర్‌ బ్రిడ్జి వద్ద ఎదురుగా గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి ఆమె కారును అడ్డగించారు. ఆమెను బలవంతంగా బయటకు లాగి మెడ, వీపు భాగంలో కత్తులతో నరికి చంపారు. అదే సమయంలో వెనుక ఆటోలో వస్తున్న హిజ్రాలను చూసి దుండగులు ఘటనా స్థలంనుంచి పారిపోయారు.

అప్పటికే తీవ్రంగా గాయపడిన హాసినిని అంబులెన్స్‌లో నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలోపు చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.

Also Read: తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు

హిజ్రాల నాయకురాలు హాసిని హత్యకు గురైన విషయం తెలుసుకున్న నెల్లూరు, కడప, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాలతోపాటు తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో హిజ్రాలు బుధవారం నెల్లూరుకు చేరుకున్నారు. నెల్లూరు రూరల్‌ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావును కలిసి తమ నాయకురాలిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. అనంతరం జీజీహెచ్‌ మార్చురీలో హాసిని మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుండడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. ఆస్పత్రి వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని అంబులెన్స్‌లో తిరుపతికి తీసుకుని వెళ్లారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు