TDP Promotions : టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌..జాతీయ, రాష్ట్ర కమిటీల్లో పలువురికి ప్రమోషన్స్‌

ఆంధ్రప్రదేశ్‌ లో జనసేన, బీజేపీలతో జతకట్టి కూటమిగా అధికారం కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ను నియమిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడు.

New Update
minister nara lokesh

Nara Lokesh as TDP National Working President

TDP Promotions : ఆంధ్రప్రదేశ్‌ లో జనసేన, బీజేపీలతో జతకట్టి కూటమిగా అధికారం కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెట్టింది.  అందులో భాగంగా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ను నియమిస్తూ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆయనతో పాటు పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.పార్టీ నేషనల్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేష్,-- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్,జాతీయ ప్రధాన కార్యదర్శులుగా...  కింజరాపు రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, రాజేష్ కిలారులను నియమించారు.

కాగా, తెలుగుదేశం పార్టీ -- సీనియర్లకు గౌరవం ఇస్తూనే  కొత్తవారికి అవకాశాలు కల్పించిందని నాయకులు చెబుతున్నారు.సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు జరిగిందని వారు తెలిపారు.-- నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం చేసినట్లు పేర్కొన్నారు. పొలిట్ బ్యూరోలో అనూహ్య మార్పులు చేయడంతో పాటు ప్రతి కమిటీలోను నూతనత్వం కనిపించేలా పలువురు కొత్తవారికి అవకాశం ఇచ్చారు.-- 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ.185 మందితో రాష్ట్ర కమిటీ కూర్పు చేశారు.  వీరిలో 7 గురు జాతీయ ప్రధాన కార్యదర్శులు-, 18 మంది జాతీయ ఉపాధ్యక్షులు,10 మంది జాతీయ అధికార ప్రతినిధులు ఉండనున్నారు.
 అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పుపై.. కసరత్తు చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ పొలిట్ బ్యూరోలో ఈసారి మండలస్థాయి పార్టీ నేతలకు స్థానం కల్పించారు. గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌ గుత్తికొండ ధనుంజయ్‌లకు అవకాశం కల్పించారు. ఓ మండల పార్టీ అధ్యక్షురాలికి, ఓ క్లస్టర్ ఇన్ఛార్జికి నేరుగా.. 
 పొలిట్ బ్యూరోలో చోటు కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

 10 మంది  రాష్ట్ర జోనల్ కో-ఆర్డినేటర్లు-గా, 59 మంది రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులుగా 77మందికి అవకాశం దక్కింది. ఈ కొత్త కార్యవర్గం ఎంపికలో చంద్రబాబు సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నారు. అలాగే సీనియర్లకు గౌరవం ఇస్తూ, కొత్తవారికి అవకాశం కల్పించారు. నామినేటెడ్ పదవులు రాని వారికి పార్టీ పదువుల్లో అవకాశం కల్పించారు. 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో బీసీలు 77మంది ఉన్నారు. ఎస్సీలు 25, ఎస్టీలు 7, మైనార్టీలు 13 మంది ఉన్నారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని సమీకరణాలను విశ్లేషించి కమిటీలను ప్రకటించింది. పార్టీకి యువత అందుబాటులోకి వచ్చేలా నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ, 33 శాతం మహిళా రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకుని నియామకాలు చేప్టటారు.

Advertisment
తాజా కథనాలు