Minister Sandhya Rani : ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం
మంత్రి సంధ్యారాణికి పెను ప్రమాదం తెప్పింది. విజయనగరం జిల్లాలో రామభద్రపురం మండలం భూసాయివలసలో ఎస్కార్ట్ వాహనాన్ని ఓ వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భద్రతా సిబ్బందితో పాటు, వ్యానులోని ముగ్గురికి స్వల్పగాయాలు అయ్యాయి.
మంత్రి సంధ్యారాణికి పెను ప్రమాదం తెప్పింది. విజయనగరం జిల్లాలో మంత్రి ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. మెంటాడ మండలం పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రామభద్రపురం మండలం భూసాయివలసలో ఎస్కార్ట్ వాహనాన్ని ఓ వ్యాను ఢీకొట్టింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే కాన్వాయ్ ను ఆపేశారు. కాగా ఈ ప్రమాదంలో ఇద్దరు భద్రతా సిబ్బందితో పాటు, వ్యానులోని ముగ్గురికి స్వల్పగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని మంత్రి సంధ్యారాణి అంబులెన్స్‌లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.
Teachers: ప్రభుత్వ ఉపాధ్యాయులకు బిగ్ అలర్ట్.. బదిలీల షెడ్యూల్ ఖరారు!
ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకురాగా మే 30లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 20 నాటికి సీనియారిటీ జాబితా పూర్తిచేసి మెగా డీఎస్సీతో ఖాళీలను భర్తీ చేయనుంది.
Teachers: ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. మే 30 లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 20 నాటికి సీనియారిటీ జాబితా పూర్తిచేసి మెగా డీఎస్సీతో ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది.
GO-117 రద్దు..
ఈ మేరకు ఈ చట్టం ప్రకారం మొదటిసారి బదిలీలు చేయనుండగా GO-117ను రద్దు చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా తీసుకునే చర్యలపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఈసారి తీసుకురాబోతున్న ఆదర్శ ప్రాథమిక పాఠశాలల విధానంలో అందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేయనున్నారు. 7,500పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటయ్యే అవకాశం ఉండగా.. 1-5 తరగతులకు 5గురు టీచర్లను కేటాయిస్తూ ఈ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే 95% పూర్తి చేయగా.. 430 బడులకు సంబంధించి ఫనల్ చేయాల్సివుంది. వార్డు, గ్రామ పంచాయతీకో బడి ఏర్పాటు చేసి మే 30 వరకు బదిలీల అంశాన్ని పూర్తి చేయనున్నట్లు సమాచారం. అలాగే సీనియారిటీ టీచర్ల జాబితాను ఏప్రిల్ 20వరకు సే పూర్తి చేయనున్నారు.
ఇక బదీలల ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. ఖాళీల ఆధారంగా ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక టీచర్ ఎన్ని ఆప్షన్స్ అయినా ఎంచుకోవచ్చు. సీనియారిటీ, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం పోస్టులు కేటాయించనున్నారు. తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్లు తాము పనిచేస్తున్న పాఠశాలలో మళ్లీ పనిచేసే అవకాశం ఉండదు. 2 సంవత్సరాలు సర్వీసు పూర్తిచేసుకున్నవారు నచ్చిన పాఠశాలను ఎంచుకోవచ్చు. మొదట ప్రధానోపాధ్యాయుల బదిలీలు ఉంటాయి. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులుంటాయి. స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలు నిర్వహించి, ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించనున్నారు. చివరిగా SGTలకు బదిలీలు నిర్వహిస్తారు.