AP Crime: ఏపీలో దారుణం.. మరో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య

కాకినాడ జిల్లా రంగరాయ మెడికల్ విద్యార్థి రావూరి సాయిరాం ఆర్ఎంసీ బాయ్స్ హాస్టల్‌లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి స్వస్థలం నరసాపురం దగ్గర బాడిద గ్రామంగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Sairam suicide

Sairam suicide

AP Crime: మెడికల్ విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చక్కగా చదువుకొని ప్రజలకు చేయాలనే ఉద్దేశంతో ఎంతోమంది మెడికల్ చదువులు చదువుతున్నారు. కానీ వారు చదువులు పూర్తి కాకముందుకే వారి జీవితం ముగుస్తుంది. తాజాగా ఏపీలో మరో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. కాకినాడ జిల్లా రంగరాయ మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చేస్తున్నాడు. సోమవారం రాత్రి ఒంటిగంట సమయంలో ఆర్ఎంసీ బాయ్స్ హాస్టల్‌లో ఎవరు లేని గదిలోకి వెళ్లి రావూరి సాయిరాం(22) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రేమ విఫలమై..

సాయిరాం ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించటంతో.. గమనించిన తోటి విద్యార్థులు తక్షణమే సిబ్బందికి తెలిపారు. వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులు మృతి చెందిన రూమ్‌ను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. అసలు విద్యార్థి ఎందుకు హ్యాంగింగ్ చేసుకున్నాడనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: వంటలో నల్ల మిరియాలు వాడితే బరువు తగ్గుతారా?

సాయిరాం స్వస్థలం నరసాపురం దగ్గర బాడిద గ్రామంగా పోలీసులు గుర్తించారు. సాయిరాం మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని వాట్సాప్ చాటింగ్, కాల్ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. మెడికో సాయిరాం సూసైడ్‌కి లవ్‌ ఎఫైర్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్ది రోజులుగా ఎంబిబిఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్‌తో లవ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సాయిరాం ఫస్ట్ ఇయర్‌లో అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేశాడు. ఈనెల 21 నుంచి  ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండటంతో ఇలా చేశాడా..? అనే కోణాలలో విచారిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని కాకినాడ జిజిహెచ్‌కి తరలించారు. సాయిరాం మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.

సాయిరాం.. మృతిపై డాక్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. సాయిరాం ఎంబిబిఎస్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని.. స్టూడెంట్స్ చూసి వెంటనే మాకు సమాచారం ఇచ్చారన్నారు. పరీక్షలు తగ్గర పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నాడా.. అనేది తెలియదన్నారు. ఎగ్జామ్స్ ముందు కౌన్సిలింగ్ ఉంటుంది. చాలా ఈజీ సబ్జెక్ట్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదన్నారు. ఫస్ట్ ఇయర్ లో మంచి మార్కులు వచ్చాయి.. స్పోర్ట్స్ కూడా బాగా ఆడతాడని సాయిరాం గురించి డాక్టర్ ఉమామహేశ్వరరావు తెలిపారు.

ఇది కూడా చదవండి:  హైదరాబాద్‌లో పెను విషాదం.. భార్యపై అనుమానంతో ఒంటికి నిప్పు అంటించుకుని..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: పల్నాడులో ప్రైవేట్ బస్సు బోల్తా.. స్పాట్‌లోనే ఐదుగురికి..

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రైవేట్‌ బస్సు బోల్తా పడింది. కరికల్లు మండలంలోని శాంతినగర్ వద్ద చీరాల వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా మహిళ బస్సులోనే ఇరుక్కుపోయింది.

New Update
_Private bus overturns

_Private bus overturns

AP Crime: పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. నకరికల్లు మండలంలోని శాంతినగర్ వద్ద ఉదయం హైదరాబాద్ నుండి చీరాల వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒక మహిళ బస్సులోనే ఇరుక్కుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. రెండు గంటలుగా ఓ మహిళను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బస్సు పూర్తిగా బోల్తా పడటంతో లోపల చిక్కుకున్న మహిళను రక్షించడం కష్టం అయినప్పటికీ.. సహాయక బృందాలు నిపుణుల సహాయంతో క్షుణ్నంగా చర్యలు చేపడుతున్నాయి.

వేగంగా వెళ్తుండటమే ప్రమాదానికి..

గాయపడిన ప్రయాణికులను వెంటనే నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బస్సు ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వేగంగా వెళ్తుండటమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు సమాచారం. ఎస్పీ శ్రీనివాసరావు, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: ఉదయాన్నే కలబంద రసం తాగితే 100 వ్యాధులు దరిచేరవు

సంఘటనాస్థలంలో ఎక్కడికక్కడ ప్రయాణికుల వస్తువులు చిందిపోవడం, గాయాలపాలైన  వారు విలవిల్లాడటం అక్కడి దృశ్యాలు అందరిని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. పోలీసులు, స్థానిక ప్రజలు కలిసి బాధితులను రక్షించేందుకు కృషి చేశారు. బాధితులకు అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలను అందించేందుకు జిల్లా వైద్య శాఖ సన్నద్ధమవుతోంది. ప్రైవేట్ బస్సుల వేగం, నిర్వహణపై మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: విశాఖలో దారుణం..కత్తులతో పొడిచి దంపతుల హత్య

( ap crime updates | ap-crime-news | ap crime latest updates | latest-news)

Advertisment
Advertisment
Advertisment