/rtv/media/media_files/2025/02/11/FA5eCIp0f4Tqa9Jy3K0m.jpg)
Anakapalli
AP News: ఆటో తో సహా రెండు ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు అనకాపల్లి జిల్లా యలమంచిలి సీఐ ధనుంజయరావు తెలిపారు. మంగళవారం యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సావిత్రి తో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చోరీ వివరాలను వెల్లడించారు.
Also Read: మాఘి పూర్ణిమ స్పెషల్.. కుంభమేళాలో కొత్తగా మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలివే
అనకాపల్లి జిల్లా రాయవరం మండలం కోనవానిపాలెం గ్రామానికి చెందిన సర్వసిద్ధి వరహాలు ఆటో డైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అయితేఈ నెల 8న అడ్డరోడ్డు జంక్షన్‌లో వరహాలు ఆటోతో ఉండగా ఒక వ్యక్తి వచ్చి యలమంచిలి వెళ్లి కూరగాయలు తీసుకురావాలని ఆటో మాట్లాడుకుని బయలుదేరారు. ఈ క్రమంలో యలమంచిలి లో దిమిలి రోడ్డు జంక్షన్ కూరగాయలు మార్కెట్ కు వెళ్లారు. ఈ క్రమంలో ఆవ్యక్తి మార్కెట్ లోకి వెళ్లగా ఆటో డ్రైవర్ టీ తాగేందుకు వెళ్లాడు. కాగా టీ తాగి వచ్చి చూసేసరికి తన ఆటోతో పాటు ఆ వ్యక్తి కనిపించకపోవడంతో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Also Read: భర్తముందే కూతుళ్లపై ప్రియుడితో అత్యాచారం చేయించిన తల్లి.. ‘వలయార్ కేసు’లో భయంకర నిజాలు!
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు మంగళవారం యలమంచిలి సమీపంలోని కల్కి పెట్రోల్ బంకు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఆటో డ్రైవర్‌పై అనుమానం వచ్చి విచారించినట్లు తెలిపారు. కాగా ఈ విచారణలో పట్టుబడ్డ వ్యక్తి అచ్యుతాపురం మండలం పూడిమడక సమీపం కడ పాలెం గ్రామానికి చెందిన ఎరిపిల్లి కాసు బాబుగా గుర్తించారు. విచారణలో అతను అప్పటికే మరో రెండు ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు గుర్తించారు. దీంతో ఆటోతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. మూడు రోజులలోనే ఈ కేసును ఛేదించామని సీఐ ధనుంజయరావు తెలిపారు.
Also Read: పారిస్ ఏఐ సమ్మిట్.. అలాంటి వారికే ఉద్యోగవకాశాలు ఉంటాయన్న ప్రధాని మోదీ