Macharla : చౌడేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్.. సీఐ సస్పెండ్!

మాచర్ల సీఐ తురక వెంకటరమణపై సస్పెన్షన్ వేటు పడింది. ఒక ప్రేమ జంట వ్యవహారంలో అడ్డగోలుగా లంచం తీసుకున్నట్లు రుజువు కావడంతో, జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

New Update
si

మాచర్ల సీఐ తురక వెంకటరమణపై సస్పెన్షన్ వేటు పడింది. ఒక ప్రేమ జంట వ్యవహారంలో అడ్డగోలుగా లంచం తీసుకున్నట్లు రుజువు కావడంతో, జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అసలేం జరిగింది?

చౌడేశ్వరి అనే యువతి, నాగరాజు అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని భావించిన ఆమె, రక్షణ కోరుతూ మాచర్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అయితే, అక్కడ ఉన్న సీఐ వెంకటరమణ బాధితురాలికి అండగా ఉండాల్సింది పోయి.. ఆమె తల్లిదండ్రులతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. చౌడేశ్వరిని తిరిగి వాళ్లకు అప్పగించేందుకు ఏకంగా 11 లక్షల రూపాయల డీల్ మాట్లాడుకున్నారు. ఆ డబ్బు తీసుకుని, యువతిని బలవంతంగా ఆమె తండ్రికి అప్పగించేశారు.

అయితే, ఈ 11 లక్షల రూపాయల పంపకాల్లో పోలీసుల మధ్యే వివాదం మొదలైంది. తమకు రావాల్సిన వాటా రాలేదని కొంతమంది పోలీసులు గొడవకు దిగడంతో ఈ 'పైసల పంచాయితీ' బయటకు పొక్కింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరపగా, సీఐ వెంకటరమణ పాత్ర స్పష్టంగా తేలింది.

సీఐ వెంకటరమణపై అవినీతి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన స్థానిక రాజకీయ నేతల పేర్లు చెప్పుకుని అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. తాజాగా చౌడేశ్వరి కేసులో ఆయన ప్రవర్తన పోలీసు శాఖకే తలవంపులు తెచ్చేలా ఉండటంతో ఎస్పీ కఠిన చర్యలు తీసుకున్నారు.

Advertisment
తాజా కథనాలు