/rtv/media/media_files/2025/02/15/84nbOhR31VISp7jELNKs.jpg)
Lakshmi shocking allegations kiran Kiran Royal and pawan kalyan
Kiran Royal: జనసేన అధినేత పవన్ అండతోనే కిరణ్ రాయల్ అరాచకాలు చేస్తున్నాడని బాధితురాలు లక్ష్మి ఆరోపిస్తోంది. ఆడవాళ్లను మోసం చేసి, వాళ్ల ఇచ్చిన డబ్బులతోనే జల్సాలు చేస్తున్నాడని చెప్పింది. ఈ మేరకు శనివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. కిరణ్ రాయల్‌పై సంచలన ఆరోపణలు చేసింది. వాడొక పరమనీచుడు. అలాంటి దుర్మార్గుడికి శిక్షపడేవరకు తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పింది. అంతేకాదు వైసీపీ నేత రోజా బంధువుతో కిరణ్ రాయల్ కు అక్రమ సంబంధం ఉందని లక్ష్మి రెడ్డి ఆరోపించారు. గతంలో రోజాను తిట్టిన కేసులో కిరణ్ అరెస్టు అయితే రాత్రికి రాత్రే బయటకు తీసుకొచ్చారని గుర్తు చేశారు. మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియో, ఫోటోలు నా దగ్గర ఉన్నాయన్నారు. వాటినీ చూపించే అ మహిళను బెదిరించి బయటకు వచ్చాడని అన్నారు.
దుర్మార్గుడు.. నీచుడు..
‘కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఓ దుర్మార్గుడు. నీచుడు. జనాలను మోసం చేసి బతుకుతున్నాడు. అతనికి ఏ వ్యాపారాలు లేవు. అమ్మాయిలను మోసం చేసుకుంటు ఉంటాడు. మహిళల దగ్గర డబ్బులు దోచుకుని రాజకీయ నాయకుడిగా తిరుగుతున్నాడు. అతనిలా నేను మోసాలు చేసి బతకట్లేదు. నా కష్టార్జితంలోనే నేను బతుకుతున్నా. పరమ నీచుడైన కిరణ్ రాయల్ పై కంప్లైట్స్ చేసేందుకు ఎంతోమంది బాధితులున్నారు. త్వరలోనే అందరూ బయటకొస్తారు. కొంతమందిని కొట్టాడని చెప్పడానికి అతని భార్య రేణుక, కూతురే సాక్ష్యం' అంటూ చెప్పుకొచ్చింది.
పవన్ కల్యాణ్ తన వెనక ఉన్నాడు..
ఇక పవన్ కల్యాణ్ తన వెనక ఉన్నాడని కిరణ్ రాయల్ చాలాసార్లు తనకు చెప్పినట్లు బయటపెట్టింది. ఆ అండతోనే దుర్మార్గాలు చేస్తున్నాడని చెప్పింది. అతడు చెబుతుంది నిజమో కాదో పవన్ చెప్పాలని డిమాండ్ చేసింది. కిరణ్ రాయల్ అరెస్ట్ అయితే తన భర్తను బయటకు రప్పించాలని ఓ బాధితురాలిని రేణుక బెదిరించినట్లు తెలిపింది. అలాగే తాను ఏ పార్టీకి చెందిన కార్యకర్తను కాదని లక్ష్మి తెలిపింది. నిజాలు బయటపెడుతున్నందుకే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పింది. కిరణ్ రాయల్ కేసులో అన్ని ఆధారాలు అప్పగించాం. నా న్యాయపోరాటాన్ని వైసీపీకి అంటకడుతున్నారు. భూమన కుటుంబంతో నాకేం సంబంధం లేదు. కిరణ్ రాయల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాకు అండగా ఎవరూ లేరు అంటూ ఆందోళన వ్యక్తం చేసింది.