Srisailam: శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. కోట్ల రూపాయల్లో నష్టం
ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్య క్సేత్రం అయిన శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ లో అర్థరాత్రి సమయంలో ఎల్ బ్లాక్ సముదాయంలో ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 15 షాపులు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాద సమాచారం అందుకున్న దేవస్థానం అధికారులు వెంటనే.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని, ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో సుమారు రెండు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/mahila-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet1-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-3-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/6-36-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/chiruthaa-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-9-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/accident-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/nia-raids-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ycp-leader-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/cbn-1-jpg.webp)