Mahanandi: మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత కలకలం!
మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత కలకలం రేపింది. క్షేత్రంలోని అన్నదాన సత్రం వద్దకు వచ్చి కుక్కను చిరుత లాక్కొని వెళ్లింది. చిరుతను చూసి ఆలయ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు
మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత కలకలం రేపింది. క్షేత్రంలోని అన్నదాన సత్రం వద్దకు వచ్చి కుక్కను చిరుత లాక్కొని వెళ్లింది. చిరుతను చూసి ఆలయ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు
పవన్ విషయంలో చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పవన్‌కు ఎక్కడా ప్రాధాన్యం తగ్గకుండా చూస్తున్నారు. ప్రతి ప్రభుత్వ ఆఫీస్‌లో తన ఫొటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ ఫొటోలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరి ఫొటోలు తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఏపీ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన వెంటనే కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. గత ప్రభుత్వం 600కు పైగా ఎస్జీటీ పోస్టులను రద్దు చేసిందని, తమ శాఖలో ఇంకా 8, 168 ఖాళీలను రిక్రూట్ చేసే అవకాశం ఉందని విద్యా శాఖ అధికారులు పేర్కొన్నారు.
AP: పాఠ్య పుస్తకాలపై నాయకుల ఫొటోలు ముద్రించడం సరైన నిర్ణయం కాదన్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఉపాధ్యాయులు. దేశ నాయకులు, ప్రకృతికి సంబంధించిన ఫోటోలు ముద్రించడమే సరైన పద్ధతన్నారు. విద్యార్థుల జీవితాలపై రాజకీయ రంగు పూయడం హేయమైన చర్య అంటూ కామెంట్స్ చేశారు.
AP: నంద్యాల జిల్లాలో రైల్వే కూలీలపై చిరుతపులి దాడి చేసింది. మహానంది మండలం గాజులపల్లె శివారు చలమలో చిరుత పులి పిల్ల సంచారం చేస్తోంది. చిరుత దాడిలో ఛత్తిస్‌గఢ్‌కు చెందిన పాండన్ అనే మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి.
AP: చంద్రబాబు కేబినెట్లో 24 మందికి చోటు దక్కింది. మంత్రుల్లో 8 ఎనిమిది మంది బీసీలు, నలుగురు కాపు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లు, ఇద్దరు ఎస్సీ, ఒకరు ఎస్టీ, ఒక ముస్లిం మైనార్టీ ఉన్నారు.
ఏపీ ఈఏపీసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేశాయి. అభ్యర్థులు ఈ లింక్ క్లిక్ చేసి తమ ఫలితాలను చూసుకోవచ్చు. https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. నంద్యాల మండలం రాయమల్పూరం సచివాలయం శిలాఫలకంను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై గ్రామ వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వెల్దుర్తి ఎస్ఐ, సీఐలపై వేటు పడినట్లు తెలుస్తోంది. నిన్న కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లెలో టీడీపీ నాయకుడు గిరినాథ్ చౌదరి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో అలసత్వం చేసినందుకు ఉన్నతాధికారులు వీరిద్దరిని విఆర్ కు పంపారు.