/rtv/media/media_files/2025/02/18/DivI3MQcnqm8UFPPEAIJ.jpg)
తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్కు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన నుంచి డబ్బులు కాజేసి కిరణ్ మోసం చేసినట్లుగా ఆరోపిస్తున్న లక్ష్మి అనే బాధితురాలు వరుసబెట్టి ఆధారాలు వదులుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ఆడియో క్లిప్ ను ఆమె బయటపెట్టారు. అమ్మాయిల గురించి కిరణ్ మాట్లాడిన అసభ్యకరమైన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ ఆడియో కాల్ రికార్డ్‌ను వైసీపీ తమ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకు కిరణ్ రాయల్ ఏం మాట్లాడాడంటే..
Also Read : యూనస్ ఒక ఉగ్రవాది..మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
అమ్మాయిల వీక్ నెస్ ఉంది
తనకు అమ్మాయిల వీక్ నెస్ ఉందన్న కిరణ్ రాయల్ .. 400 మందితో అక్రమ సంబంధం ఉందని చెప్పుకొచ్చాడు. తాను లైఫ్ లాంగ్ ఇలానే ఉంటానని.. నీకు 10 ఏళ్లు వయసు ఉన్నప్పుడే రోజుకో అమ్మాయితో తిరిగే వాడినని అన్నాడు. తాను మారలేను కానీ, నిన్ను మాత్రం బాగా చూసుకుంటా అని చెప్పడం ఆడియోలో వినిపించింది. గడిచిన 7నెలల్లో నీకు తెలిసిన ఆరుగురితో తిరిగానని లక్ష్మితో కిరణ్ రాయల్ మాట్లాడాడు. ఇప్పటికీ అందులో ఇద్దరు అమ్మాయిలతో వాళ్ల ఇంటికి కూడా వెళ్తానని చెప్పుకొచ్చాడు. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నుంచి జనసేన టిక్కెట్‌పై పోటీ చేయాలి అంటే రూ. 20 కోట్లు ఖర్చు పెట్టాలన్నారని.. దీంతో నాకు సీటు లేదని చెప్పేశారని కిరణ్ తెలిపాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానని.. తనకు ఏదో ఒకటి నామినేటెడ్ పదవి వస్తుంది నా కూతురు మీద ఒట్టు అంటూ లక్ష్మితో కిరణ్ రాయల్ చెప్పినట్లుగా ఆడియో వైరల్ గా మారింది.
Also Read : భార్యను చంపిన భర్త... పోలీసులకు పట్టించిన నాలుగేళ్ల కూతురి డ్రాయింగ్!
మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోలు వాస్తవాలు కాదన్నారు కిరణ్ రాయల్. తన దగ్గర కూడా కొన్ని ఆడియోలు ఉన్నాయని.. వాటిని కోర్టుకు సమర్పిస్తానంటూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఏపీ హైకోర్టులో ఆయన లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులో అరెస్టు చేసే అవకాశం ఉందని కిరణ్ రాయల్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే లంచ్‌మోషన్ పిటిషన్‌పై విచారణకు న్యాయస్థానం నిరాకరించింది. రెగ్యులర్ పిటిషన్‌పై విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది.
Also Read: Tesla: భారత్ లో టెస్లా ఉద్యోగాల జాతర మొదలు..
అరేయ్ పేటీఎం డాగ్స్ నేను పారిపోయే రకం కాదురా.. : కిరణ్ రాయల్
— RTV (@RTVnewsnetwork) February 18, 2025
నాపై దుష్ప్రచారం చేయడానికి వైసీపీ పేటీఎం డాగ్స్ చాలా కష్టపడుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోలు వాస్తవాలు కాదు.
నా దగ్గర కూడా కొన్ని ఆడియోలు ఉన్నాయి.వాటిని కోర్టుకు సమర్పిస్తాను #kiranroyal… pic.twitter.com/insNZHOFlA
Also Read : BCCI : దిగొచ్చిన బీసీసీఐ.. ఆటగాళ్లు ఫ్యామిలీని వెంట తెచ్చుకోవచ్చు కానీ..!