డీకే శివకుమార్ ను కలిసిన వైఎస్ షర్మిల
ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ఈ రోజు కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ను బెంగళూరులోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తాజా రాజకీయాలపై చర్చించారు.
ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ఈ రోజు కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ను బెంగళూరులోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తాజా రాజకీయాలపై చర్చించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల కొడుకును కసాయి తండ్రి కొట్టి చంపాడు. ముస్తకీమ్ అనే చిన్నారిపై సవతి తల్లి చాడీలు చెప్పడంతో తండ్రి ఇమ్రాన్ బాబును చావబాదాడు. చిన్నారి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏపీ సీఎం జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి నిందితుడని అన్ని ఆధారాలున్నా అతన్ని జగన్ కాపాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి జగన్ రాజకీయ వారసుడే కాదన్నారు.
కడప జిల్లా బద్వేల్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ అవినాష్ రెడ్డి షర్మిలపై విమర్శలు గుప్పించారు. మనిషి పుట్టుక పుట్టిన తర్వాత విచక్షణా జ్ఞానం ఉండాలన్నారు. మా గురించి చెడ్డగా ఎంత ప్రచారం చేసుకుంటారో చేసుకోండి మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని కామెంట్స్ చేశారు.
బీజేపీ అంటేనే గిట్టని వైఎస్సార్‌కు బీజేపీకి బానిస అయిన జగన్ వారసుడు ఎలా అవుతారు? అని అన్నారు షర్మిల. ముస్లింలకు ఎన్నో వాగ్ధానాలు చేసిన జగన్ వారిని దారుణంగా మోసం చేశారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మాత్రమే ముస్లింలకు భరోసా ఇస్తుందని అన్నారు.
అవినాష్ రెడ్డి ఓడిపోవాలనేదే తన లక్ష్యమని వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్య చేసిన వారు చట్టసభల్లో ఉండకూడదన్నారు. తనకు రాజకీయాలు ఇష్టం లేదని..న్యాయం మాత్రమే కావాలని స్పష్టం చేశారు. షర్మిలకు మంచి పేరు రావడంతో జగన్ ఆమెను పక్కన పెట్టారని వ్యాఖ్యానించారు.
అన్నమయ్య జిల్లా టీడీపీలో అసమ్మతి ఏ మాత్రం చల్లారడం లేదు. రైల్వే కోడూరులో టీడీపీ అసమ్మతి నేత బత్యాల చంగల్రాయుడు బలప్రదర్శనకు దిగారు. ర్యాలీ నిర్వహిస్తూ తన బలాన్ని అధిష్టానానికి చూపించి రాజంపేట స్థానం కోసం పోరాటం చేస్తున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ జగన్ బీజేపీకి బానిసలా మారాడని ఏపీపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యా రాజకీయాలు చేసే అవినాష్ రెడ్డిని, కాపాడే జగన్ రెడ్డిని.. ఇద్దరినీ ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నట్లు పేర్కొన్నారు.