మంగళగిరిలో జగన్ మీటింగ్-LIVE
టీడీపీ కీలక నేత నారా లోకేష్ బరిలో ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఈ రోజు వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. జగన్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
టీడీపీ కీలక నేత నారా లోకేష్ బరిలో ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఈ రోజు వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. జగన్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై వైసీపీ నేత దాదాపీర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత తల్లి ఆరోపించింది. దాదాపీర్ ఇంట్లో తల్లి కూతురు అద్దెకు ఉంటుండుగా.. తను లేని సమయంలో కుమార్తెపై అత్యాచారయత్నం చేశాడని తెలిపింది.
పులివెందులలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈ రోజు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సొంత చిన్నాన్నను చంపిన వ్యక్తికి జగన్ అండగా నిలుస్తున్నారని ఫైర్ అయ్యారు. షర్మిల స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
రాహుల్ గాంధీ ఏపీ పర్యటన ఖరారైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడపకు రాహుల్ గాంధీ రానున్నారు. 11వ తేదీ ఉదయం 10.30 గంటలకు కడపలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాహుల్ గాంధీ పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు.
AP: మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి. సీఎంగా, ప్రధానిగా మోదీ నిజాయతీగా పనిచేశారని అన్నారు. వంద దేశాలకు కరోనా వ్యాక్సిన్ పంపిన ఘనత మోదీదే అని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో కూటమికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
AP: షర్మిల, సునీతకు కడప కోర్టు షాక్ ఇచ్చింది. వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దని గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ వారికి రూ.10వేల జరిమానా విధించింది.
ఏపీకి ప్రత్యేక హోదా లేకుండా చేసినందుకు మోదీ క్షమాపణ చెప్పి రాష్ట్రంలో అడుగు పెట్టాలన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. జగన్ దత్తపుత్రుడు చేసిన అవినీతి మోదీకి ఇంతకాలం కనపడలేదా? అని ప్రశ్నించారు. భారతి స్ట్రాటాజీ అందరినీ గొడ్డలితో చంపడమేనా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీపీసీసీ చీఫ్ షర్మిలకు బద్వేల్ పోలీసులు షాక్ ఇచ్చారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఎన్నికల సభలో వివేకా మర్డర్ కేసు విషయాన్ని ప్రస్తావించడంతో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద షర్మిలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కడప ఎంపీ సీటు కోసం రసవత్తర పోరు జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల ఇక్కడ బరిలో ఉండటంతో టీడీపీ అభ్యర్ధిగా ఉన్న భూపేష్‌రెడ్డి గెలుపుకోసం చాలా కష్టపడుతున్నారు. అయితే ఇక్కడ ఎవరూ విజయం సాధిస్తారో చెప్పేసిన ఆర్టీవీ స్టడీ కోసం ఈ ఆర్టికల్ చదవండి.