AP:అన్నా చెల్లెళ్ళ ఆస్తి వివాదం..జగన్, షర్మిల లేఖలను బయటపెట్టిన టీడీపీ

వైసీపీ అధినేత జగన్, ఆయన చెల్లెల్లు షర్మిల మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో టీడీపీ జగన్, షర్మిల లేఖలను విడుదల చేసింది. మొదట షర్మిల లేఖను బయటపెట్టిన టీడీపీ ఇప్పుడు తాజాగా జగన్ లేఖను కూడా బయటపెట్టింది. 

author-image
By Manogna alamuru
New Update
tdp

YS Family Letters: 

వైసీపీ అధినేత జగన్, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య ఆస్తి వివాదం ఎప్పటి నుంచో రగులుతూనే ఉంది. ఇప్పటి వరకూ వాళ్ళిద్దరి మధ్యనే సాగుతున్న వ్యవహారం ఇప్పుడు టీడీపీ ద్వారా బయటపడింది. ఆస్తి విషయంలో జగన్ సొంత చెల్లెలు షర్మికు రాసిన లేఖను టీడీపీ బయటపెట్టింది. మొదట జగన్ రాసిన లేఖకు షర్మిల ఇచ్చిన రిప్లై లేఖను బయటపెట్టిన టీడీపీ తరువాత జగన్ లేఖను కూడా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌‌లో జగన్ సొంత చెల్లెలు అయిన షర్మిలను బెదిరిస్తూ లేఖ రాశారు. అందులో నన్ను రాజకీయంగా ఏమి అనకు, రాజకీయంగా నాకు అడ్డు రాకు, అప్పుడు నీకు ఆస్తులు రాసిస్తా... అంటూ షర్మిలను బెదిరిస్తూ జగన్ రాశారు.  "నన్ను రాజకీయంగా ఇబ్బందులు పెడుతుంటే,  నీకు నేను ఆస్తులు ఎందుకు ఇవ్వాలి  ? రాజకీయంగా నా పై విమర్శలు చేస్తున్న నీకు, నేను చిల్లి గవ్వ ఇవ్వను. సరస్వతి సిమెంట్స్ షేర్స్ తిరిగి ఇచ్చేయండి..అమ్మ మీద, నీ మీద కేసు వేస్తున్నా." అంటూ షర్మిలతో అనడం క్లియర్‌‌గా లెటర్‌‌లో చూడొచ్చు. 

అసలు వివాదం ఏంటి?

వైఎస్ ఫ్యామిలీలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లో వాటాల కేటాయింపు మీద వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై జగన్ భార్య భారతితో కలసి సెప్టెంబర్ 9న షర్మిల, విజయమ్మపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ లో పిటిషన్ వేశారు. ఈ విషయంలో ఐదు పిటిసన్లు వేశారు జగన్. మొదట్లో షర్మిలకు వాటా కేటాయింఆలి అనుకున్నాఉ కానీ కొన్నేళ్ళుగా ఆమె తనకు వ్యతిరేకంగా రాజకీయం చేయడం వల్ల వాటాలను తిరిగి తీసుకుంటున్నట్లు ఆయన పిటిషన్‌లో తెలిపారు. 2019 ఆగస్టు 21న ఎంఓయూ ప్రకారం విజయమ్మ, రష్మిలకు షేర్లు కేటాయించామన...కానీ పలు కారణాల వల్ల కేటాయింపులు జరగలేదని జగన్ చెప్పారు. అందుకే ఇప్పుడు ఆ షేర్లను విత్‌ డ్రా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెపారు. అయితే ఎన్‌సీఎల్‌టీ ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తరువాతి విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది.

షర్మిల లేఖ..

ఈ నేపథ్యంలో జగన్ రాసిన లేఖకు షర్మిల ఇచ్చిన రిప్లైను టీడీపీ బయటపెట్టింది. జగన్ లేఖకు షర్మిల కూడా ధీటుగానే జవాబు ఇచ్చింది. జగన్ రాసిన రాతల మీద ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తండ్రి అంటే రాజశేఖర్ రాసిచ్చిన ఆస్తని నలుగురు మనవళ్లకు సమానంగా పంచి ఇవ్వాలనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను అంటూ షర్మిల రిప్లై లెటర్‌‌లో రాశారు . నాన్న చెప్పిన విషయాన్ని అప్పుడు మీరు కూడా అమలు చేస్తాని హామీ ఇచ్చారు...ఇప్పుడు ఇలా మాట్లాడం సరి కాదంటూ షర్మిల అన్నారు. దివంగత నేత మన తండ్రి కోరికలను నెరవేర్చడానికి, చేసుకున్న అవగాహన ఒప్పందానికి కట్టుబడి ఉండటంలో మీరు నైతికతను కోల్పోయారు. దాన్నుంచి బయట పడతారని ఆశిస్తున్నా. మీరు అలా చేయకూడదని నిర్ణయించుకుంటే చట్ట పరంగా ముందుకు వెళ్లడానికి నాకు పూర్తి హక్కులు ఉన్నాయి. ఇవన్నీ వాస్తవాలే అని నిర్ధరించడానికి మన అమ్మ కూడా ఈ లేఖపై సంతకం చేశారు. నా రాజకీయ జీవితం పూర్తిగా నాకు సంబంధించింది. నా వృత్తి పరమైన జీవితాన్ని నిర్దేశించడానికి నేను మిమ్మల్ని అనుమతించను.  బహిరంగ వేదికలపై మీకు, అవినాష్‌కు వ్యతిరేకంగా మాట్లాడకుండా నాతో మీరు సంతకం చేయించుకున్నారన్నది అసంబద్ధం. సెటిల్‌మెంట్‌కు రావాలని నాకు షరతు విధించడం కూడా పూర్తిగా అసమంజసం. మన తండ్రి అన్ని ఆస్తులలో తన మనవళ్లు, మనువరాళ్లకు సమాన వాటా ఉండాలని కోరుకున్నారు. అంతే గానీ దాని మీద రాజకీయమైన ప్రభావాలేవీ వుండకూడదు. నా రక్త సంబంధమైన అన్నగా మీరు ఇష్టపూర్వకంగా సంతకం చేసిన ఎంవోయూని అమలు చేయడం మీ బాధ్యత.

ఒప్పందం ప్రకారం నా వాటాలో భాగంగా నాకు ఇచ్చిన సరస్వతీ పవర్‌పై (ఒప్పందంపై) సంతకం చేసిన వెంటనే దాని షేర్లన్నింటినీ నాకు బదిలీ చేస్తానని మీరు హామీ ఇచ్చారు. అయితే, మీరు చాలా సంవత్సరాలుగా ఆ హామీ నెరవేర్చడంలో విఫలమయ్యారు. మన తల్లి భారతి సిమెంట్, సండూర్‌లకు చెందిన షేర్లను పొందిన తర్వాత, మిగిలిన షేర్లను మీరు బహుమతిగా ఇచ్చిన తర్వాత కూడా ఫిర్యాదు చేయడం సరి కాదు. మీరు మన తల్లికి సరస్వతి పవర్ షేర్లపై పూర్తి హక్కులు ఇస్తూ గిఫ్ట్ డీడ్‌లపై  సంతకాలు చేశారు. షేర్లతో విడిపోవడానికి అంగీకరించిన తర్వాత, మీరు ఇప్పుడు అనవసరమైన వివాదాలను లేవనెత్తడానికి, కుటుంబాన్ని కోర్టుకు ఈడ్చడానికి నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మీరు మన తండ్రి ఆదేశాలకు తూట్లు పొడుస్తూ ఏకపక్షంగా ఎంవోయూని రద్దు చేయాలని కోరుతున్నారు. చట్టపరంగా మీ లేఖ ఎంవోయూకు విరుద్ధం. దానికి ఏమాత్రం పవిత్రత లేదు. కానీ మీ లేఖ వెనుక ఉన్న దురుద్దేశం నాకు చాలా బాధ కలిగించింది. ఇది మన తండ్రి మీద మీకున్న గౌరవాన్ని తగ్గించే విధంగా వుంది. ఆయన ఎన్నడూ కలలో కూడా ఊహించని పని చేశారు. చట్టబద్ధంగా మీ కుటుంబ సభ్యులకు చెందాల్సిన ఆస్తులను లాక్కోనేందుకు సొంత తల్లి మీద, నా మీద కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎంవోయూ ప్రకారం మీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. మన తండ్రి అడుగు జాడల్లో నడవాల్సిన మీరు ఈ విధంగా దారి తప్పడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది అంటూ షర్మిల లేఖ రాశారు.

Also Read: Hyd:ఈడీ కార్యాలయంలో ముగిసిన సీనియర్ ఐఏఎస్ అమోయి కుమార్ విచారణ

Advertisment
Advertisment
తాజా కథనాలు