/rtv/media/media_files/2025/02/23/UfeLSM5pXycyWQbuF6od.jpg)
attended group 2 in wedding attire
Group 2 Exam: ప్రభుత్వ కొలువు సంపాదించాలనే తన కలను నిజం చేసుకునేందుకు ఒక యువతి నేరుగా పెళ్లి మండపం నుంచి ఎగ్జామ్ కి వెళ్ళింది. పెళ్లి జరిగిన గంటల్లోనే పసుపు బట్టలు, తలపై జిలకర బెల్లంతో ఆమె కలలకు కొత్త దారులు వేసేందుకు బయలుదేరింది. కన్న కలలను నిజం చేసుకోవాలనే ఆమె డెడికేషన్ చూసినవారంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ కేంద్రం దగ్గర జరిగిన ఈ ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.
Also Read: Maha Kumbh Mela: కుంభమేళాలో డిజిటల్ స్నానం...కేవలం 1100 లే..అదిరిపోయింది కదా ఐడియా!
మెడలో తాళి, పెళ్లిచీరతోనే గ్రూప్ -2 ఎగ్జామ్కు నవవధువు | New bride for Group-2 exam in wedding saree | prime9news#newlybride #group2exam #prime9telangana #shortvideo pic.twitter.com/Ps4RcTDoCB
— Prime9News (@prime9news) February 23, 2025
పెళ్లి బట్టల్లో గ్రూప్ 2 పరీక్షకు
చిత్తూరులోని ఓ కల్యాణ మండపంలో మమత అనే యువతికి ఆదివారం ఉదయం వివాహం జరిగింది. అదే రోజు గ్రూప్ 2 పరీక్ష కూడా ఉండడంతో.. మమత పెళ్లి బట్టల్లోనే తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ సెంటర్ కి చేరుకుంది. వివాహం తర్వాత ఎక్కువ సమయం లేకపోవడంతో తలపై జిలకర బెల్లం, పూల జడ, పెళ్లి చీరతోనే పరీక్షకు హాజరైంది.
Also Read: MAZAKA Trailer: నాన్న ఆంటీ.. కొడుకు అమ్మాయి.. నవ్వులే నవ్వులు 'మజాకా' ట్రైలర్! చూశారా
మొత్తం 175 కేంద్రాల్లో 92,250 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఉ.10 గంటల నుంచి మ.12.30 వరకు పేపర్-1, మ.3 నుంచి సా.5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది. మరోవైపు అభ్యర్థులు రోస్టర్ తప్పులను సరిచేసే వరకు గ్రూప్ 2 పరీక్ష వాయిదా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అర్థరాత్రి వరకు రోడ్లపై ధర్నాలకు దిగారు. ప్రభుత్వం వద్దని చెప్పిన వినకుండా ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Bhupalpally: అయ్యో! పాపం.. పాలు పట్టించిన గంటల్లోనే ఇద్దరు కవలలు మృతి! ఏమైందంటే