Kadapa: కడపలో ఏటీఎం చోరీల కలకలం.. ఒకే రోజు 3 చోట్ల దొంగలు ఏం చేశారంటే? కడప జిల్లాలో ఏటీఎం దొంగతనాలు దుమారం రేపుతున్నాయి. నగరంలోని పలు ఏటీఎంలో డబ్బు చోరీకి గురైంది. విశ్వసరాయ సర్కిల్ వద్ద చోరీకి ప్రయత్నించగా సైరాన్ మోగడంతో దొంగలు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. By Kusuma 22 Sep 2024 | నవీకరించబడింది పై 22 Sep 2024 11:41 IST in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి AP : కడప జిల్లా వ్యాప్తంగా ఏటీఎం దొంగతనాలు అలజడి సృష్టిస్తున్నాయి. నగరంలోని పలుచోట్ల ఉన్న ఏటీఎంలో కొందరు దుండగులు నగదు చోరీకి పాల్పడుతున్నారు. నగరంలోని ద్వారక నగర్‌లో ఉన్న ఏటీఎంలో 6,19300 లక్షల రూపాయలు దొంగతనం చేయగా.. ఒంటిమిట్ట ఏటీఎంలో కూడా 37 లక్షల రుపాయలు చోరీ చేశారు. నగరంలో ఉన్న విశ్వసరాయ సర్కిల్ దగ్గర ఏటీఎంను చోరీ చేయడానికి దుండగలు ప్రయత్నించారు. ఇంతలో సైరాన్ మోగడంతో దొంగలు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసుల వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. Also Read : నేటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష #kadapa #atm-cash-theft మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి