/rtv/media/media_files/2025/04/04/NFONM5I1oaxwxoKDHKI4.jpg)
Electricity shock
Electric shock : చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం అరవపల్లి గ్రామంలో ఘోరం జరిగింది. శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ ఆవరణంలో ఆడుకుంటున్న రత్న కుమార్ నాలుగేళ్ల కుమారుడు గజముఖన్ కు విద్యుత్ షాక్ తగిలింది.
Also read: Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!
రేకుల షెడ్డు కు ఏర్పాటుచేసిన ఇనుప పైపు పట్టుకుని ఆడుకుంటుండగా విద్యుత్ సరఫరా అయి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. అక్కడే పడిపోయిన బాలున్ని గుర్తించిన స్థానికులు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలున్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆలయ ఆవరణంలో ఆడుకుంటూ అభం శుభం తెలియని చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుము కున్నాయి. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి వేప చెట్టును నరికి వేయడంతో చెట్టు కొమ్మలు విద్యుత్ లైన్ రేకుల షెడ్డు మీదపడి విద్యుత్ ఘాతంతో బాలుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపించారు. విద్యుత్ షాక్ గురైన బాలుడి మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాగా ఆసుపత్రి నుంచి ఇంటికి తరలించిన బాలున్నిచూడడానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అల్లారుముద్దుగా పెంచుకున్న నాలుగేళ్ల కుమారుడు చలనం లేకుండా పడి ఉండడం చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. కాగా బాలుని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Also Read: ఎట్టకేలకు నెరవేరిన యూనస్ కోరిక.. మొదటిసారి విందు పంచుకున్న మోదీ
Also read: Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!
Tulasi Reddy : జనసేన రద్దు..బీజేపీలో విలీనం..కాంగ్రెస్ నేత తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
పవన్ తన జనసేనను రద్దు చేసుకొని బీజేపీలో విలీనం చేయడం మంచిదని రాజ్యసభ మాజీసభ్యులు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి సూచించారు. పవన్‌ది ఏ సిద్ధాంతం? చేగువేరా సిద్ధాంతమా? సనాతన ధర్మ సిద్ధాంతమా?లేక ఊసరవెల్లి సిద్ధాంతమా? అంటూ విమర్శించారు.
Pawan Kalyan-tulasi reddy
Tulasi Reddy : పవన్ తన జనసేనను రద్దు చేసుకొని బీజేపీలో విలీనం చేయడం మంచిదని రాజ్యసభ మాజీసభ్యులు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి సూచించారు. పవన్‌ది ఏ సిద్ధాంతం? చేగువేరా సిద్ధాంతమా? సనాతన ధర్మ సిద్ధాంతమా?లేక ఊసరవెల్లి సిద్ధాంతమా? అంటూ విమర్శించారు. తులసిరెడ్డి శనివారం విజయవాడలో కాంగ్రెస్ రాష్ర్ట కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మొదటినుండి ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ అంటే బాబు,జగన్,పవన్ అని చెబుతూ వచ్చిందని, బీజేపీ చేతిలో వీళ్ళు ముగ్గురూ కీలు బొమ్మలని అంటున్నామని, అది నిజమని నిన్నటి పిఠాపురం జన సేన సభ నిరూపించిందని తులసి రెడ్డి అన్నారు.
ఇది కూడా చూడండి: Rohit Sharma Retirement: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
తనకు పదవి పిచ్చి లేదని,సైద్ధాంతిక బలం వుందని పవన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. పదవి పిచ్చి లేకుంటే ఉప ముఖ్య మంత్రి పదవి ఎందుకు? సోదరుడు నాగబాబుకు MLC పదవి ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. కడప జిల్లాలో కాసినాయన ఆశ్రమాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చడమేనా మీరు వల్లించే సనాతన ధర్మం? అంటూ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీని తానే నిలబెట్టినట్లు పవన్ చెప్పడం విడ్డూరం. తాతకు మనుమడు దగ్గు నేర్పినట్లుంది పవన్ వాలకం అంటూ దెప్పి పొడిచారు. నిన్నటి పిఠాపురం సభ మొత్తం ఆత్మ స్తుతి పరనింద గా సాగిందన్నారు. సొంత డబ్బా వాయించుకోవడం తోనే సరిపోయిందని సూపర్ సిక్స్ హామీల ప్రస్తావనే లేదని విమర్శించారు.
ఇది కూడా చూడండి:Ranya Rao Case: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
మంత్రుల పనితీరులో పవన్ కు 10 వ రాంకు రావడం గమనార్హమని, రాష్ర్ట వ్యాప్తంగా గ్రామ పంచాయితీలు మురికి కూపాలుగా తయారయ్యాయి.అటవీ శాఖ అనుమతులు రాక అనేక పనులు ప్రారంభం కాలేదని తులసిరెడ్డి అన్నారు. ఇప్పటికైనా పవన్ ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకొని తన శాఖ మీద దృష్టి కేంద్రీకరించాలని తులసి రెడ్డి సూచించారు..
Also Read: Court Movie: కంటెంట్ ముఖ్యం బిగులు.. పావురాలు ఎగరేస్తూ 'కోర్ట్' టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్!
Electric shock : చిత్తూరులో దారుణం.. విద్యుత్ ఘాతానికి నాలుగేళ్ల బాలుడు మృతి
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం అరవపల్లి గ్రామంలో ఆలయ ఆవరణలో ఆడుకుంటున్న బాలునికి విద్యుత్ షాక్ తగిలింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Ketireddy: గెస్ట్‌హైస్ వివాదం.. హైకోర్టులో కేతిరెడ్డికి ఊరట
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హైకోర్టులో ఊరట లభించింది. గెస్ట్‌హౌస్ వివాదంలో న్యాయస్థానం స్టేటస్ కో విధించింది. Short News | Latest News In Telugu | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
Nominated Posts: ఏపీలో 38 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన..ఏ పార్టీకి ఎన్నంటే ?
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల కేటాయింపులు కొనసాగుతోన్నాయి. తాజాగా 38 నామినేటెడ్ పోస్టులు కేటాయించింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Aghori: వాడు అఘోరి కాదు అమ్మాయిల పిచ్చోడు.. ప్రతిరోజు రక్తంతో అభిషేకం చేసి! (వీడియో)
తెలుగు రాష్ట్రాల్లో నానా రచ్చ చేస్తున్న అఘోరి గురించి వర్షిణి అన్న విష్ణు సంచలన నిజాలు బయటపెట్టాడు. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
BIG BREAKING: పేదలకు సీఎం చంద్రబాబు శుభవార్త!
పేదలకు ఏపీ సీఎం చంద్రబాబు మరో శుభవార్త చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి. వైద్యసేవలు అందించనున్నారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Duvvada: ఏ క్షణమైనా నా రాజాను చంపేస్తారు.. అందుకే కరెంట్ కట్ చేసారు: మాధురి సంచలనం!
ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందని దివ్వెల మాధురి చెబుతోంది. Short News | Latest News In Telugu | శ్రీకాకుళం | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
LSG vs MI: ముంబై నిర్లక్ష్యం.. ఔట్ అప్పీల్ చేయనందుకు 56 పరుగులు అదనం!
Viral: అర్థరాత్రి వంటగదిలోకి చొరబడిన సింహం.. వీడియో వైరల్ (VIDEO)
Earthquake: నేపాల్‌లో భూకంపం.. ఉత్తర భారత్‌లో ప్రకంపనలు
Electric shock : చిత్తూరులో దారుణం.. విద్యుత్ ఘాతానికి నాలుగేళ్ల బాలుడు మృతి
IPL 2025: ఐపీఎల్లో అతనుంటే చాలు.. ఏ ఆర్డర్లో వస్తే ఏంటి? గేల్ కామెంట్స్ వైరల్!