Gas Explosion : సత్యసాయి జిల్లాలో భారీ పేలుడు.. నలుగురి మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కదిరి రూరల్‌ మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన డిటోనేటర్లు, గ్యాస్‌ సిలిండర్లు పేలిపోయాయి. దీంతో నలుగురు మృతి చెందగా.. 21 మంది గాయపడ్డారు.

New Update
FotoJet (70)

Gas Explosion : ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కదిరి రూరల్‌ మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన డిటోనేటర్లు, గ్యాస్‌ సిలిండర్లు పేలిపోయాయి. దీంతో నలుగురు మృతి చెందగా.. 21 మంది గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా  పేలుడు మూలంగా ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.  గ్యాస్ మంటలు చుట్టు పక్కల వ్యాపించడంతో భారీ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  ఓ కూలీ తన ఇంట్లో నిల్వ ఉంచిన నాలుగు డిటోనేటర్లు పేలి గ్యాస్‌ సిలిండర్లకు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ఫైర్‌ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన వారిలో చాలామంది  పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గ్యాస్ మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయపడి బయటకు పరుగులు తీశారు. మంటలు చుట్టూ పక్కల ఇండ్లకు కూడా వ్యాపించడంతో ప్రమాద స్థాయి పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు