/rtv/media/media_files/2025/02/28/ePWsIKPGM8CGkr2bmcGA.jpg)
lokesh budget Photograph: (lokesh budget)
AP Budget 2025-26:
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులో నారా లోకేశ్ శాఖకు భారీగా నిధులు కేటాయించారు. ఏపీలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి వేల కోట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మంత్రిగా నారా లోకేశ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయా శాఖలకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారు.
గత ప్రభుత్వం నాశనం చేసిన విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. ఈ బడ్జెట్‌లో విద్యా శాఖకు అత్యధికంగా రూ.31,805 కోట్లు కేటాయించాం.
— Telugu Desam Party (@JaiTDP) February 28, 2025
* 2025-26 విద్యా సంవత్సరం నుంచి, సూపర్ సిక్స్ హామీ తల్లికి వందనం ప్రారంభిస్తున్నాం.
* సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పధకం ద్వారా 35.69 లక్షల… pic.twitter.com/NdhZx8eGJO
Also Read: Ravi Prakash: TV9 లోగో వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
- మొత్తం ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3 లక్షల 22 వేల 359 కోట్లు కాగా.. పాఠశాల విద్యాశాఖకు రూ.31,806 కోట్లు, ఉన్న విద్యకు రూ.2,506 కోట్లు కేటాయించారు.
- నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు
- ఐటీ, ఎలక్ట్రానిక్స్‌కు రాయితీల కోసం రూ.300 కోట్లు
- డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం కోసం రూ. 3,486 కోట్లు
- ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్
- మనబడి పథకానికి రూ.3,486 కోట్లు
- తల్లికి వందనం స్కీమ్‌కు అమలుకు రూ.9,407 కోట్లు
- ITI, IIT ల కోసం రూ.210 కోట్లు
Also Read: Ravi Prakash: TV9 లోగో వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
Also Read: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
Also Read: 15 నెలలు.. 4 ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఇదే: హరీష్ సంచలన ఆరోపణలు!