ఏపీకి మరో శుభవార్త.. ఇక రాష్ట్రమంతటా వెలుగులే వెలుగులు!

ఏపీకి ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో హడ్కో ఛైర్మన్ సచివాలయంలో భేటీ అయ్యారు.

New Update
HUDCO

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా దూసుకుపోతోంది. పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.

ఇది కూడా చదవండి: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో ఏడుగురు షూటర్లు అరెస్టు..

సీఆర్డీఏకు రూ.11,000 కోట్లు రుణం

అందులో ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్) ఒకటి. ఇటీవలే ఈ కంపెనీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఏకంగా సీఆర్డీఏకు రూ.11,000 కోట్లు రుణం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: కాటేసిన కాళేశ్వరం.. కేసీఆర్‌కు బిగ్ షాక్!

కాగా ఇటీవల కేంద్రం బడ్జెట్‌లో అమరావతికి రూ.15,000 కోట్లు కేటాయించింది. ఇక ఇప్పుడు హడ్కో రూ.11,000 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో మొత్తం రూ.26,000 కోట్లు కానుంది. ఈ మొత్తంతో అమరావతిలో నిర్మాణాలను శరవేగంగా నిర్మించాలని సీఆర్డీఏ అధికారులు, ప్రభుత్వం భావిస్తోంది.

ఇది కూడా చదవండి: వైసీపీకి బిగ్ షాక్.. మూడు రోజులు కస్టడీకి తీసుకున్న సీఐడీ

ఇందులో భాగంగానే ఈ ఏడాది డిసెంబర్ నుంచి అమరావతిలో నిర్మాణ పనులలో వేగం పెంచాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు టెండర్లకు పిలిచి.. ఖరారు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది మాత్రమే కాకుండా రాష్ట్రంలోని టిడ్కో ఇళ్ల నిర్మాణానికి కూడా హడ్కో రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

ఇది కూడా చదవండి: రూ.10 నాణేలు చెల్లుతాయి.. లావాదేవీలకు వాడొచ్చు

విద్యుత్ సబ్‌ స్టేషన్ల నిర్మాణానికి ఆర్థిక సాయం

పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చును సైతం రుణంగా ఇచ్చేందుకు హడ్కో అంగీకరించింది. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు మరో తీపి కబురు తెలిపింది. రాష్ట్రంలో విద్యుత్ సబ్‌ స్టేషన్ల నిర్మాణానికి హడ్కో ఆర్థిక సాయం చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో హడ్కో చైర్మన్ సంజయ్ కుల్ శ్రేష్ట సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో డిస్కంలకు ఆర్థిక సాయం చేసేందుకు హడ్కో ఛైర్మన్ సంజయ్ కుల్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు