Ap Rains: తీవ్ర అల్పపీడనం..రేపు తీరం దాటనున్న వాయుగుండం!

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వల్ల దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం పుదుచ్చేరి , నెల్లూరు మధ్య తీరాన్ని తాకవచ్చని వాతావరణశాఖ తెలిపింది.

New Update
Vishakhapatnam Rains: విశాఖలో భారీ వర్షం.. రాకపోకలు, స్కూళ్లు బంద్‌

Ap Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం వాయుగుండం బలపడింది. ఇది తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతోందని , ఇది గురువారం పుదుచ్చేరి , నెల్లూరు మధ్య తీరాన్ని తాకవచ్చని వాతావరణశాఖ తెలిపింది.

Also Read:  బెంగళూరును ముంచెత్తిన వర్షాలు..

దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో రేపు  కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు, ఎల్లుండి కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. 

పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్‌, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలకు ఆస్కారముందని తెలిపింది. బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, గరిష్ఠంగా గంటకు 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

Also Read:  సల్మాన్ ఇంటి దగ్గర భారీ భద్రత..24/7 పోలీస్ పెట్రోలింగ్

మంగళవారం ఉదయం నెల్లూరులో అత్యధిక వర్షపాతం కావలిలో 15 సెం.మీగా నమోదైంది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంతో ఆంధ్ర ప్రదేశ్ హోం మంత్రి అనిత  ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాల యంత్రాంగాన్ని సంసిద్ధంగా ఉంచాలని హోం మంత్రి సూచించారు. సహాయక చర్యల నిమిత్తం ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచినట్టు ఆమె తెలిపారు. 

తాడేపల్లి విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలోనే ఉండి జిల్లా కలెక్టర్లకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారు. దీంతో పాటూ చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి, ప్రకాశం జిల్లాలలోని ప్రతి మండలంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. మత్స్యకారులు, రైతులు, గొర్రెల కాపరులు తుపాను ప్రభావం ఉన్నంత వరకూ బయటికి వెళ్లకూడదని హోం మంత్రి విజ్ఞప్తి చేశారు.

Also Read: దక్షిణ కోస్తా, రాయలసీమకు తుపాన్ ముప్పు..హోంమంత్రి సమీక్ష

భారీ నుంచి అతి భారీ ...

అల్పపీడనం ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణింకి కూర్మనాథ్‌ అన్నారు. బుధవారం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read:  మరిన్ని ఇళ్ళ ముందు స్టే బోర్డులు..రేవంత్ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?


నైరుతి తిరోగమనం...

మహరాష్ట్ర,గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, ఒడిశా,అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ , మణిపూర్‌, మిజోరం, త్రిపుర, నాగాలాండ్‌ తో పాటు ఉత్తర బంగాళాఖాతం నుంచి నైరుతి రుతుపవనాలు వైదొలుగుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో ఏపీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించేందుకు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు