YCP Manifesto : ఎల్లుండి వైసీపీ మేనిఫెస్టో విడుదల
AP: వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. ఎల్లుండి వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మేనిఫెస్టోపై ముఖ్యనేతలతో సమాలోచనలు చేశారు సీఎం జగన్.
AP: వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. ఎల్లుండి వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మేనిఫెస్టోపై ముఖ్యనేతలతో సమాలోచనలు చేశారు సీఎం జగన్.
AP: సీఎం జగన్‌పై ట్విట్టర్(X) వేదికగా విమర్శలు గుప్పించారు చంద్రబాబు. తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా... మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా? అని అన్నారు. ఇది కాదా వికృత మనస్తత్వం? అంటూ విమర్శించారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అంబటి రాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కన్నా ఒక్క ఓటు తగ్గినా తాను నైతికంగా ఓటమి చెందినట్టేనన్నారు.
గుంటూరులో మహిళ కిడ్నాప్ వివాదం ముగిసింది. టీడీపీ నాయకులు బలవంతంగా విడుదల రజినీ పేరుతో నామినేషన్ వేయించేందుకు ఆమెను ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు స్త్రీని గుర్తించి పోలీసులు ఇంటికి పంపించారు. స్వచ్ఛందంగానే నామినేషన్ వేసినట్లు బాధితురాలు తెలిపింది.
AP: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జగన్‌కు మద్దతుగా ఇప్పటివరకు 62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. వారి రాజీనామాలు ఆమోదిస్తే వైసీపీకి అనుకూలంగా ఉంటారని పేర్కొన్నారు. దీనిపై విచారణను 2 వారాలకు కోర్టు వాయిదా వేసింది.
ఏప్రిల్ 26 సీఎం జగన్ తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. గుంటూరులోని తాడేపల్లిలో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే వైసీపీ ఏం చేస్తుందనే దానిపై క్లారిటీ రానుంది.
AP: జాబు రావాలంటే బాబు రావాలని అన్నారు చంద్రబాబు. ఇది మా బ్రాండ్ అని పేర్కొన్నారు. వాలంటీర్లకు రూ.10 వేలు వేతం ఇస్తామని హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాలంటీర్లను మరింత రాటుదేల్చేలా చేస్తామన్నారు. పాతపట్నంను ఆదుకుంటా.. ఇది నేను ఇస్తున్న గ్యారెంటీ అని అన్నారు.
AP: కాంగ్రెస్‌పై మోడీ విషం చిమ్ముతున్నారని అన్నారు షర్మిల. మతాల మధ్య మళ్లీ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రేమను నింపే మాటలు మాట్లాడుతున్నారని.. మోడీ మాత్రం మతాలను విడదీసి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
AP: ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఏపీలోని కీలక అధికారులపై ఈసీ వేటు వేసింది. విజయవాడ సీపీతో పాటు ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం జగన్ పై దాడి, అనంతర పరిణామాల నేపథ్యంలో ఈసీ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.