CM Chandrababu: నేడు కుప్పంకు సీఎం చంద్రబాబు
AP: ఈరోజు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. రెండు రోజులపాటు కుప్పంలో ఉండనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కుప్పంలో పర్యటించనున్నారు.
AP: ఈరోజు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. రెండు రోజులపాటు కుప్పంలో ఉండనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కుప్పంలో పర్యటించనున్నారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. చాంబర్ లో స్వల్ప మార్పుల అనంతరం ఐటీ, RTG, మానవ వనరుల శాఖ మంత్రిగా నారా లోకేష్ పదవి బాధ్యతలు తీసుకున్నారు.సెక్రటేరియట్ నాలుగో బ్లాక్లో ఆయనకు చాంబర్ కేటాయించారు.
గుంటూరులో తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు కేటాయించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన ఈ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
రాష్ట్రంలో బ్రాండెడ్ మద్యం దొరకకపోవడం తమ ఓటమిలో కీలక పాత్ర పోషించిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇంకా ఇసుక కొరత కారణంగా కార్మికులు ఉపాధి కోల్పోవడం కూడా తమను దెబ్బకొట్టిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రభావం కూడా నష్టం చేసిందన్నారు.
రేపు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
AP: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. మృతుడిని ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణగా గుర్తించారు. దీనిపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అతని కుటుంబానికి అండగా ఉండాలన్నారు.
AP: మాజీ సీఎం జగన్పై మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. ప్యాలెస్ల పిచ్చోడా.. రాష్ట్రం నీ తాత జాగీరా అని మండిపడ్డారు. వైసీపీ ఆఫీసుల కోసం 26 జిల్లాల్లో చేసిన భూకేటాయింపులను ట్విట్టర్లో షేర్ చేశారు.
ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ వైసీపీకి చుక్కలు చూపిస్తోంది. అనుమతులు లేవన్న కారణంతో నిన్న తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసును అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. నేడు పలు జిల్లాల్లో చేపట్టిన ఆఫీసుల నిర్మాణాలు ఆపాలని వైసీపీకి నోటీసులు అందించారు.
AP: బాపట్ల యువతి అత్యాచారం, హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఘటన జరిగిన 48 గంటల్లో నిందితుల్ని పట్టుకున్నారు. నిందితులు దేవరకొండ విజయ్, దేవరకొండ శ్రీకాంత్, కారంకి మహేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.