AP Cabinet: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం?
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమైంది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హత నిబంధన రద్దు, నూతన మద్యం పాలసీ తదితర అంశాలపై మంత్రి వర్గం చర్చించనున్నట్లు సమాచారం.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమైంది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హత నిబంధన రద్దు, నూతన మద్యం పాలసీ తదితర అంశాలపై మంత్రి వర్గం చర్చించనున్నట్లు సమాచారం.
సీఎం చంద్రబాబు చీరాల పర్యటన రద్దు అయింది. ఆఖరి నిమిషంలో తన పర్యటను రద్దు చేసుకున్నారు సీఎం. చేనేత దినోత్సవంలో పాల్గొనేందుకు చీరాల వెళ్లాల్సిన సీఎం పర్యటన వాయిదా పడినట్లు సీఎంఓ తెలిపింది.
ఈరోజు ఏపీ కేబినెట్ కీలక భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
AP: ఈరోజు బాపట్ల జిల్లా చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చేనేత సదస్సులో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
AP: అమరావతి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు సర్కార్. అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈరోజు ముళ్లకంపల తొలగింపును ప్రారంభించనున్నారు మంత్రి నారాయణ.
కారుకు సైడ్ ఇవ్వలేదని సయ్యద్ అరీఫ్ అనే యువకుడిని దుండగులు కత్తితో పొడిచి చంపిన ఘటన ఏపీలోని బాపట్ల జిల్లాలో జరిగింది. చికిత్స పొందుతూ అరీఫ్ మృతి చెందగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
AP: ప్రభుత్వ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇకపై ఉదయాన్నే మరుగుదొడ్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేసే పని ఉపాధ్యాయులకు లేదని చెప్పింది. ఈ విధానాన్ని ఆపేసినట్లు ప్రకటించింది. ఈ ఆప్షన్ యాప్ నుంచి కూడా తొలిగించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ కక్ష, అధికార ప్రోద్బలంతోనే.. తనను అరెస్ట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.