AP Govt: ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్..మూడు కేటగిరీలుగా ఎస్సీలు

అనేక ఏండ్లుగా సాగుతున్న ఎస్సీ వర్గీకరణకు ఏపీ సర్కార్‌ అమోదముద్ర వేసింది. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజీవ్‌రంజన్‌ మిశ్రా ఇచ్చిన నివేదికతో పాటు మంత్రుల కమిటీ నివేదికపై కేబినెట్‌ చర్చించింది.

New Update
 sc classification

sc classification

AP Govt: అనేక ఏండ్లుగా సాగుతున్న ఎస్సీ వర్గీకరణకు ఏపీ సర్కార్‌ అమోద ముద్ర వేసింది. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏక సభ్య కమిషన్‌ రాజీవ్‌రంజన్‌ మిశ్రా ఇచ్చిన నివేదికతో పాటు దానిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్‌ చర్చించింది. వీటి ప్రకారం రోస్టర్‌ పాయింట్లను 200గా నిర్ణయించింది. జిల్లాను యూనిట్‌గా తీసుకుని అమలు చేయాలని కొంత మంది మంత్రులు కోరగా, అలా చేస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని అధికారులు తెలిపినట్లు సమాచారం. 2026లో జనగణన జరిగాక జిల్లాలవారీగా అమలు చేసే అంశాన్ని పరిశీలిద్దామని, ప్రస్తుతానికి నివేదికను ఉన్నది ఉన్నట్టుగా ఆమోదిద్దామని సీఎం చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.దీనిని ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం, దీనిపై ప్రత్యేక చర్చను చేపట్టి సభ ఆమోదం తీసుకుని.. ఆ వెంటనే కేంద్రానికి పంపించనున్నారు. 

Also read: Sunita Williams : భూమి మీదకొచ్చాక నడవలేని పరిస్థితిలో సునీతా విలియమ్స్.. చాలా హెల్త్ ప్రాబల్స్

కాగా.. ఏకసభ్య కమిషన్‌ రాష్ట్రంలోని ఎస్సీలను గ్రూప్‌-1, 2, 3లుగా విభజించింది. గత ఏడాది నవంబరు 15న ఏకసభ్య కమిషన్‌ను నియమించిన ప్రభుత్వం 2 నెలల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కమిషన్‌ సభ్యుడు రాజీవ్‌ రంజన్‌ మిశ్రా రాష్ట్రంలోని ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. 13 ఉమ్మడి జిల్లాల్లో ఎస్సీ సంఘాలు, మేధావులు, ఉద్యోగుల నుంచి వినతులు తీసుకున్నారు. ఎస్సీల్లోని అన్ని ఉపకులాల నేతలు, ఉద్యోగ సంఘాలతో చర్చించారు. కొన్నిచోట్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు వినతిపత్రాలు అందించారు. ఎస్సీల్లో ఏయే వర్గాలు ప్రభుత్వ ప్రయోజనాలను సమానంగా పొందలేక పోయాయన్న విషయంపై కమిషన్‌ దృష్టి సారించింది. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించి, ఎస్సీ ఉపకులాల జనాభాపై కూడా దృష్టి పెట్టింది. 2024 జనవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వం కులగణన చేపట్టింది. ఆ గణాంకాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఎస్సీల్లో ఆయా వర్గాలు ప్రభుత్వ రంగంలో అవకాశాలు పొందలేకపోవడంపై దృష్టి పెట్టింది. ఎస్సీల్లో మాదిగలు ప్రభుత్వ ఉద్యోగాల్లో అతి తక్కువ భాగస్వామ్యం కలిగి ఉన్నారని గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా ఉద్యోగాల్లో ఎస్సీల్లోని ఏ ఉపకులం వారు ఎంతమంది ఉన్నారన్న గణాంకాలు తెలుసుకుంది.

Also read: BIG BREAKING: యాంకర్ శ్యామల, రీతూ చౌదరిలపై కేసు నమోదు
దీనిప్రకారం గ్రూప్‌-1 (రెల్లి కులస్థులు) ఈ కులస్తులు సమాజంలో అత్యంత వెనుకబడి ఉండడంతో జనాభా ప్రాతిపదికన వారికి 1 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కమిషన్‌ సిఫారసు చేసింది. గ్రూప్‌-2 (మాదిగ, ఉపకులాలు) 6.5%జనాభా దామాషాలో రెండో స్థానంలో ఉండడంతో వీరికి 6.5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కమిషన్‌ పేర్కొంది.గ్రూప్‌-3 (మాల, ఉపకులాలు)7.5% జనాభా ఎక్కువగా ఉండడంతో వీరికి 7.5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని నివేదిక పేర్కొంది.

Also Read : విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్‌ సంచలనం!


  అయితే ఈ నివేదికపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.ఏకసభ్య కమిషన్‌.. గత వైసీపీ ప్రభుత్వం వలంటీర్ల ద్వారా చేపట్టిన గణనను ప్రాతిపదికగా చేసుకుంది. అయితే, ఆ సర్వే లోపభూయిష్టంగా ఉందన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సదరు సర్వేను పునఃసమీక్షించాలని ఎస్సీ మాల సామాజిక వర్గ నేతలు కోరుతున్నారు.గతంలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగ నియామక దరఖాస్తుల్లో ఎస్సీ ఉపకులాలను పేర్కొనలేదని, జాబితాల్లోనూ తప్పులున్నాయని చెబుతున్నారు.కొత్తగా పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకుని కుల గణన చేపట్టాలని, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల సర్వేను పరిగణనలోకి తీసుకోవద్దని కోరుతున్నారు.వైసీపీ హయాం నాటి సర్వే ఆధారంగా నిర్ణయించే వర్గీకరణ.. అన్ని వర్గాలకు న్యాయం చేయదని అంటున్నారు.రాష్ట్రంలో 26 జిల్లాలు ఉంటే కమిషన్‌ ఉమ్మడి 13 జిల్లాల్లోనే పర్యటించిందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు 

 ఎస్సీ ఉపకులాల నివాసిత ప్రాంతాల్లో కమిషన్‌ పర్యటించలేదని అంటున్నారు.100 రోజుల్లో నివేదిక అనేది చాలా తక్కువ సమయమని, కేవలం డీఎస్సీలో రిజర్వేషన్లు అమలు చేసేందుకు హడావుడి చేశారని ఆరోపిస్తున్నారు.జస్టిస్‌ రామచంద్ర కమిషన్‌ను 1996లో నియమిస్తే.. నివేదిక 1997లో ఇచ్చిందని, జస్టిస్‌ ఉషా మెహ్రా కమిషన్‌ను 2006లో నియమిస్తే 2007లో నివేదిక ఇచ్చారని.. ప్రస్తుత అధ్యయనం అతి తక్కువ సమయంలో పూర్తి చేశారని పేర్కొంటున్నారు. ఆయా శాఖలపై అనుభవం లేని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిని నియమించడమెందుకని, రిటైర్డ్‌ జడ్జితో కమిషన్‌ వేసి ఉంటే బాగుండేదని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.


 Also Read: ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు