/rtv/media/media_files/2025/03/06/keRKIrwI6tMXg9b6goL9.jpg)
International Women's Day
AP NEWS:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా ఏపీ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల కోసం చేనేత వస్త్రాలను 50 శాతానికి డిస్కౌంట్ సేల్ ప్రారంభమైంది. గురువారం వెలగపూడిలో రాష్ట్ర సచివాలయంలో మూడో బ్లాక్ ఉన్న ఆప్కో షోరూమ్ లో చేనేత వస్త్రాలపై 50 శాతం తగ్గింపు ధరల ప్రత్యేక కౌంటర్ ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యే బండారు శ్రావణితో కలిసి మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆప్కో షో రూమ్ లో వస్త్రాల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు.
/rtv/media/media_files/2025/03/06/44QIcJjNkE7jydz1FwnJ.jpeg)
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యే బండారు శ్రావణి చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. ఈ సందర్బంగా మంత్రులు సవిత, గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాల కొనుగోలుపై 50 శాతం మేర డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ డిస్కౌంట్ విక్రయాలను ఈ నెల పదో తేదీ సోమవారం సాయంత్రం వరకు నిర్వహిస్తామని తెలిపారు. సచివాలయ ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. చేనేత వస్త్రాలను వారానికోసారి ధరించుదామని, నేతన్నలకు అండగా ఉందామని మంత్రి సవిత పిలుపునిచ్చారు.
/rtv/media/media_files/2025/03/06/0BAafs8W8OobsTJ6stbf.jpeg)
Also Read: ముంబైపై గుజరాతీల కుట్ర.. RSS నేతపై దేశద్రోహం కేసు: మాజీ సీఎం సంచలనం!
AP News: జగన్ క్షమాపణ చెప్పాలి లేదంటే.. జనమాల శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్!
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని జనమాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జగన్ తీరు పోలీసులందరినీ కలవరపాటుకు గురిచేసిందన్నారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఆయన మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
Janamala Srinivasa Rao shocking comments on jagan
AP News: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని జనమాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏపీ పోలీస్ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గా జగన్ మాట్లాడిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు. జగన్ తీరు పోలీసులందరినీ కలవరపాటుకు గురిచేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పోలీసులను బట్టలూడదీస్తానని అనడం ఏమిటని మండిపడ్డారు. జగన్ వెంటనే పోలీసులందరికీ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వాలకు భజన చేయాలా..
ఈ మేరకు పోలీస్ అధికారుల సంఘం ఎప్పుడు ఒకరిపైన విమర్శలు చేయలేదు. ఏ ప్రభుత్వం ఉన్నా.. పోలీసుల మీద తప్పుగా మాట్లాడితే ఖండించాం. మాకు ప్రభుత్వాలకు భజన చేయాల్సిన అవసరం లేదు. పోలీసుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మీడియా ముందుకు వస్తున్నాం. వేమగిరి ఎస్సై టీడీపీ నేతలతో తిరిగిన వీడియోలు ఉంటే దానిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
ఇదిలా ఉంటే.. వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కానీ గతంలోనే ప్రాజెక్టు పూర్తిచేశామని, జాతికి అంకితం ఇస్తున్నామంటూ జగన్ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని, చేయని పనులూ చేసినట్లు చెప్పుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అంటూ ఎద్దేవా చేశారు.
Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి
jagan | police | srinivas | tdp | telugu-news | today telugu news
ఆర్బీఐ ఎఫెక్ట్.. ఈ కంపెనీల షేర్లు భారీగా పతనం
Amla Health Benefits: ఉసిరి చల్లగా ఉంటుందా..వేడిగా ఉంటుందా!
Telangana: ఈ జిల్లాల్లో మళ్లీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ!
East Godavari : మాములు దొంగ కాదు.. కొట్టేసిన నగలను ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు!
Pawan Kalyan: 3 రోజులపాటు ఆస్పత్రిలోనే పవన్ చిన్న కుమారుడు!