జగన్‌కు బై..బై! జనసేనలోకి విడదల రజిని!

మాజీ మంత్రి విడదల రజిని వైసీపీకి గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జనసేనలోకి వెళతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా పవన్‌ను కలిసేందుకు విడదల రజిని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
vidadala rajani

విడదల రజిని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశారు. ప్రత్యర్థిపై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలవ్వడంతో ఒక్కొక్కరుగా టీడీపీ, జనసేన పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పుడు విడదల రజిని సైతం అదే బాటలో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

జనసేన తీర్థం పుచ్చుకోనున్న రజిని!

మాజీ మంత్రి విడదల రజిని వైసీపీకి గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జనసేనలోకి వెళతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా పవన్‌ను కలిసేందుకు విడదల రజిని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బాలినేని శ్రీనివాస రెడ్డి.. రజిని కలిసి చర్చించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో విడుదల రజిని అనుచరులు రియాక్ట్ అవుతున్నారు. పార్టీ మార్పు లేదంటూ వారు చెబుతున్నారు.

Also Read:  దీపావళి ధమాకా.. బిగ్ బాస్ లో సెలెబ్రెటీల సందడి.. ప్రోమో చూసేయండి

పొలిటికల్ ఎంట్రీ

2014 ఎన్నికల సమయంలో విడదల రజినీ ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడి నుంచి రజిని రాజకీయ ప్రస్తానం మొదలైంది. నిత్యం ప్రజల్లో ఉంటూ వారితో కలిసిపోయారు. రజిని తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో చక చకా మాట్లాడటంతో ఆమె ప్రతిభను గుర్తించిన ప్రత్తిపాటి పుల్లారావు 2017లో వైజాగ్ లోని మహానాడులో రజినితో మాట్లాడించారు.

Also Read :  అల్లు అర్జున్ కు తెలంగాణ పోలీసుల ఎదురుదెబ్బ..'పుష్ప2' కు ఊహించని షాక్?

అందులో విడదల రజినీ తన ప్రసంగంతో చంద్రబాబు దృష్టిని ఆకర్షించింది. దీంతో ఒక్కసారిగా రజిని పేరు మారుమోగిపోయింది. ఇప్పటికీ అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఇలా ఓ వైపు పాపులారిటీ తెచ్చుకుంటూనే మరోవైపు విఆర్ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో 2019 ఎన్నికల్లో తనకు చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. కానీ తనకు టికెట్ ఇవ్వలేనని చంద్రబాబు చెప్పేశారు. 

Also Read : తెలుగు స్టార్ హీరోలపై సూర్య షాకింగ్ కామెంట్స్.. ఒక్కొక్కరి గురించి ఒక్కోలా?

వైసీపీలో చేరిక

దీంతో విడదల రజినీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే వైసీపీ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తొలి ఎన్నికల్లోనే టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుపై 8000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక అదే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన విడదల రజినినీ 2022 ఏప్రిల్ 11న జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆమెకు వైద్య ఆరోగ్య శాఖల మంత్రిగా అవకాశం ఇచ్చారు. 

Also Read: డిజిటల్ అరెస్టుల్లో రూ.120 కోట్లు పోగొట్టుకున్న బాధితులు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకుపైకి దూసుకెళ్లిన బొలెరో!

ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు.

New Update
ACCIDENT

AP Kakinada road accident one man died

Accident: ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు. ఈ మేరకు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బొలెరో డ్రైవర్ మద్యం సేవించినట్లు అనుమానిస్తు్న్నారు. శివ అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా మృతిడి పేరెంట్స్, బంధువులు శోకచంద్రంలో మునిగితేలారు. 

ప్రేమోన్మాది కత్తితో దాడి..

ఇదిలా ఉంటే.. విశాఖలో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానంటూ కొద్ది రోజులుగా బెదిరిస్తున్నాడు. ఈ సంఘటన  విశాఖపట్నం జిల్లాలో బుధవారం కలకలం రేపింది. స్థానిక వివరాల ప్రకారం.. కొమ్మాది స్వయం కృషినగర్‌లో తల్లి, కుమార్తె  ఇద్దరు నివాసం ఉంటున్నారు. యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా హత్య చేయాలని పక్క ప్లాన్‌తో వారి ఇంటికి కత్తితో వచ్చి దాడి చేశాడు. ఈ దాడి తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తెకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు.  

ఇది కూడా చదవండి: Duvvada Srinivas-Madhuri: త్వరలోనే దువ్వాడ శ్రీనివాస్-మాధురి పెళ్లి.. వేణు స్వామి చేతుల మీదుగా.. ఫొటోలు వైరల్!

ప్రమాదంపై సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రాతాన్ని పరిశీలించారు. ఎలా జరిగిందని చుట్టు పక్కల వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తల్లి, కూతురిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేయటంతో కాలనీ వాసులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. పోలీసులు నింతుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసుల బిగ్ ట్విస్ట్.. ఒకరు అరెస్ట్!

 kakinada | died | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment