మాజీ హోంమంత్రి సోదరుడు అని చెప్పుకుంటూ.. ఏం చేశాడంటే? కొవ్వూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంప్ రైటర్‌గా పనిచేస్తున్న దాసరి స్టాలిన్ మాజీ హోంమంత్రి తానేటి వనిత తన సోదరి అని చెప్పుకుంటూ రూ.10 లక్షలు తీసుకున్నాడు. నరసరాజు అనే వ్యక్తి తన కూతుళ్లకి చెందిన ఆస్తిని రిజిష్ట్రేషన్ చేస్తానని డబ్బులు దోచుకున్నాడు. By Kusuma 26 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి మాజీ హోంమంత్రి తానేటి వనిత తన సోదరి అని చెప్పుకుంటూ డబ్బులు తీసుకున్న ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొవ్వూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాసరి స్టాలిన్ స్టాంప్ రైటర్‌గా పనిచేస్తున్నాడు. ఏలూరుకి చెందిన నరసరాజు తన కూతుళ్లకు చెందిన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాడు. ఇది కూడా చూడండి: Chennai: ప్రైవేట్ స్కూళ్లో గ్యాస్ లీకేజీ...30 మంది విద్యార్థులు..! సోదరుడని చెప్పి.. మాజీ హోంమంత్రి తానేటి వనిత సోదరుడు అని చెప్పి, ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని స్టాలిన్ రూ.పది లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత నరసరాజు అడిగితే చంపేస్తానని బెదిరించాడు. ఆ డబ్బు రిటర్న్ ఇవ్వనని, ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించనని, ఎవరితో అయిన చెబితే చంపేస్తానన్నాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఇది కూడా చూడండి: Iran-Israel: ఇరాన్ సైనిక బలగాలపై ఇజ్రాయెల్ దాడులు! స్థానిక అధికారులు బాధితుల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. మాజీ మంత్రి సోదరుడు అని చెప్పుకుని డబ్బులు తీసుకున్న స్టాలిన్‌ను శిక్షించి తప్పకుండా నరసరాజు సమస్యను పరిష్కరిస్తామని స్థానిక అధికారులు హామీ ఇచ్చారు. దుర్మార్గానికి పాల్పడుతన్న వారిని తప్పకుండా శిక్షిస్తామన్నారు. ఇలా ఎవరైనా లంచం తీసుకుంటే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయమని పోలీసులు తెలిపారు. ఇది కూడా చూడండి: జగన్ బెయిల్ రద్దు..? అన్నాచెల్లెలి ఆస్తుల వివాదంలో టర్నింగ్ పాయింట్! ప్రతీ కార్యాలయంలో ఇలా అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారని, వారిని గుర్తించి ఎలాగైన చర్యలు తీసుకుంటామని సచివాలయ అధికారులు తెలిపారు. కొందరు ఇలానే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా డబ్బులు తీసుకుంటున్నారని మరికొందరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావాలనే అధికారులు భూ రికార్డుల్లో పేర్లు మార్చి మోసం చేస్తున్నారని, మళ్లీ తమ దగ్గర డబ్బులు దోచుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇది కూడా చూడండి: వైసీపీ నేత సజ్జల అరెస్ట్‌పై కోర్టు కీలక తీర్పు! #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి