AP Crime: 8వ తరగతి బాలికపై వార్డెన్ భర్త లైంగిక దాడి!

ఏపీ ఏలూరు జిల్లా 'శ్రీ స్వామి దయానంద సరస్వతి ఆశ్రమం హాస్టల్' బాలికలపై అత్యాచారానికి పాల్పడిన బీసీ వెల్ఫేర్ ఉద్యోగి శశి కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హాస్టల్ వార్డెన్‌, భార్య ఫణిశ్రీ సహకారంతోనే శశికుమార్ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు గుర్తించారు.

New Update
elraa

AP Crime: ఆశ్రమం హాస్టల్ లో చదువుకుంటున్న మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడుతున్న వార్డెన్ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికలకు మాయమాటలు చెప్పి  వారి జీవితాలను నాశనం చేస్తున్న కామాంధుడిని ఎట్టకేలకు ఏలూరు టూ టౌన్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఈ కేసును చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు.. వసతి అందించే పేరుతో దారుణాలు చేస్తున్న బీసీ వెల్ఫేర్ ఉద్యోగి శశి కుమార్ బాగోతం బయటపెట్టారు. 

బాపట్ల తీసుకువెళ్లి అత్యాచారం..

ఈ మేరకు ఏలూరు జిల్లా ఎస్పీ కే.ప్రతాప్ శివ కిషోర్ నిందితుడిని అరెస్టు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీనాపేట ప్రాంతంలో అనధికారికంగా శ్రీ స్వామి దయానంద సరస్వతి ఆశ్రమం హాస్టల్ కొంతకాలంగా నడుపుతున్నారు. అయితే ఇందులో పనిచేసే లేడీ వార్డెన్ భర్త బీసీ వెల్ఫేర్ ఉద్యోగా శశికుమార్ అమ్మాయిలను వేధిస్తున్నట్లు సమాచారం అందింది. ఇందులో భాగంగానే నిఘా పెట్టాం. అయితే సెప్టెంబర్ 17న 8వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికను హాస్టల్ వార్డెన్ ఫణిశ్రీ, కేర్ టేకర్ లావణ్యలు బలవంతంగా వార్డెన్ భర్త అయిన బొమ్మిరెడ్డిపల్లి శశి కుమార్ తో కారులో పంపించారు. అతడు ఆ మైనర్ బాలికను బాపట్ల తీసుకువెళ్లి అత్యాచారం చేసి ఏలూరు తీసుకొచ్చాడు. దీంతో ఆ మైనర్ బాలిక తోటి బాలికల సహాయంతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే ఫోక్సో, అత్యాచార చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. 

అయితే పరారిలో ఉన్న శశి కుమార్ కోసం జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ ఆదేశాలతో ఏలూరు డిఎస్పీ డి.శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏలూరు 2 టౌన్ సిఐ వెంకట రమణ తమ సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు శశి కుమార్, వసతిగృహం వార్డెన్ బొమ్మిరెడ్డిపల్లి ఫణి శ్రీ, కేర్ టేకర్ బయ్యవరపు లావణ్య గ్రీన్ సిటీలో ఉన్నారనే సమాచారంతో అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన ఏలూరు డిఎస్పీ డి.శ్రావణ్ కుమార్, ఏలూరు టూ టౌన్ ఇన్ స్పెక్టర్ వైవి. రమణ, ఎస్పీ ఇన్ స్పెక్టర్ బి.ఆది ప్రసాద్, నిడమర్రు ఇన్స్పెక్టర్ ఎం.సుభాష్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ఎం.సుబ్బారావు, మహిళా ఎస్పై లావణ్యలను ఎస్పీ కిషోర్ అభినందించారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు