ED Raids : వైసీపీ మాజీ ఎంపీ సత్యనారాయణకు బిగుస్తున్న ఈడీ ఉచ్చు

వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మెడకు ఈడీ ఉచ్చు బిగుసుకుంటోంది. సోదాల్లో 300పైగా స్థిరాస్తుల విక్రయ దస్తావేజులు ఎంవీవీ, జీవీ కుటుంబ సభ్యుల పేరు మీద గుర్తించామని.. స్థిరాస్తుల కొనుగోలు రూ.50 కోట్ల వరకు నగదు లావాదేవీలు జరిగినట్లు ఈడీ వెల్లడించింది.

New Update
MVV SATYANARAYANA

MVV Satyanarayana: వైసీపీ నేత, విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మెడకు ఈడీ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇటీవల ఆయన నివాసంపై చేసిన దాడులపై ఈడీ ప్రకటన విడుదల చేసింది. 19వ తేదిన 5 చోట్ల సోదాలు నిర్వహించినట్లు చెప్పింది. మనీలాండరింగ్ చట్టం ఉల్లంఘన జరగడంతో సోదాలు చేసినట్లు పేర్కొంది. 12.5 ఎకరాలకు సంబంధించిన రూ.200 కోట్లు రుపాయలు అవకతవకలపై సోదాలు చేసినట్లు తెలిపింది.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇంట్లో విషాదం!

వృద్ధుల అనాధాశ్రమం కోసం ప్రభుత్వం భూమి కేటాయించిందని.. భూములపై భారీ అవకతవకలు జరిగాయంటు ఆరిలోవ పోలీసుస్టేషన్ లో నమోదైన కేసు ఆధారంగా మరింత దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈడీ సోదాల్లో 300పైగా స్థిరాస్తుల విక్రయ దస్తావేజులు ఎంవీవీ, జీవీ కుటుంబ సభ్యుల పేరు మీద గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్థిరాస్తుల కొనుగోలు రూ.50 కోట్ల వరకు నగదు లావాదేవీలు జరిగినట్లు ఈడీ తెలిపింది.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త!

ఈడీ దాడి ఎందుకు?..

ఈ ఏడాది జూన్‌ 22న ఎండాడలోని హయగ్రీవ ప్రాజెక్టుకు సంబంధించిన 12.51ఎకరాల భూమిని తమ నుంచి మోసపూరితంగా లాక్కున్నారని చిలుకూరి జగదీశ్వరుడు, ఆయన భార్య రాధారాణి ఆరిలోవ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా ఈ నమోదు అయిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ జరిగిందని రంగంలోకి దిగిన ఈడీ.. ఈ నెల 19న ఈ కేసుకు సంబంధించి వైసీపీ మాజీ ఎంపీ సత్యనారాయణ, జీవివి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. మొత్తం 5 ప్రాంతల్లో 24 గంటలపాటు ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 

ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురికి నోటీసులు!

ఈడీ చెప్పిన వివరాలు... హయగ్రీవ ఫామ్స్‌ డెవలపర్స్‌ సంస్థకు వృద్ధులు, అనాథల కాటేజీల కోసం ఎండాడలో భూమిని 2008లో ప్రభుత్వం తక్కువ ధరకు ఇచ్చింది. 2010లో ‘హయగ్రీవ’ రూ.5.63 కోట్లు చెల్లించగా, రిజిస్ట్రేషన్‌ నాటికి ప్రభుత్వం కేటాయించిన భూమి  విలువ రూ.30.25 కోట్లుగా ఉన్నట్లు గుర్తించినట్లు ఈడీ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.200 కోట్లపైగా విలువ ఉన్న ఈ భూమిని ఎంవీవీ, జీవీ ఫోర్జరీ సంతకాలు, డాక్యుమెంట్ల ద్వారా స్వాధీనం చేసుకున్నారని సంచలన ప్రకటన చేసింది. 2021 నుంచి ప్లాట్లుగా విభజించి వివిధ వ్యక్తులకు తప్పుడు పత్రాలతో అమ్మకాలు జరిపారని తెలిపింది. ఇలా అమ్మిన ప్లాట్లతో నేరపూరితంగా రూ.150 కోట్లకుపైగా సంపాదించినట్లు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: బ్లాక్‌లో టీటీడీ వీఐపీ దర్శన టికెట్లు.. ఎమ్మెల్సీపై కేసు నమోదు!

Advertisment
Advertisment
తాజా కథనాలు