Devineni Uma: దేవినేని ఉమపై కేసు.. ఎందుకంటే?
టీడీపీ నేత దేవినేని ఉమపై కేసు నమోదు అయ్యింది. ఈసీ నిబంధనలు ఉల్లంఘించడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. జక్కంపూడి కాలనీలో భారీ ర్యాలీ చేపట్టడంతో చర్యలు తీసుకున్నారు.
టీడీపీ నేత దేవినేని ఉమపై కేసు నమోదు అయ్యింది. ఈసీ నిబంధనలు ఉల్లంఘించడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. జక్కంపూడి కాలనీలో భారీ ర్యాలీ చేపట్టడంతో చర్యలు తీసుకున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్ షర్మిల ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎన్నికల సమీపిస్తున్న వేళ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పి. గన్నవరం సీటును జనసేనకు కేటాయించారు. తాజాగా జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ పేరును ప్రకటించారు పవన్. తోలి జాబితాలో పి. గన్నవరం టికెట్‌ను రాజేష్‌కు చంద్రబాబు ఇచ్చిన విషయం తెలిసిందే.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ప్రచారాన్ని మహిళలు అడ్డుకున్నారు. సాల్ట్ భూముల సమస్యపై గత నలభై ఆరు రోజులుగా నిరసన చేస్తున్నా ఎందుకు పట్టించుకోలేదని గ్రామస్థులు నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతకు షాక్ తగిలింది. ఆమె ప్రచారాన్ని ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. అనుమతి పత్రాలు ఉంటే చూపించాలని అధికారులు కోరారు. దీంతో వంగా గీత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పిఠాపురంలో ఎవరూ తోపు కాదన్నారు వైసీపీ ఎంపీ వంగ గీతా. పిఠాపురం కాపుల ఆడబడుచుని.. కాపులంతా తనతోనే ఉన్నారన్నారు. పవన్‌కు రాజకీయ అవగాహన లేదన్నారు. తనను జనసేనలోకి ఆహ్వానించడమేంటో అర్థంకాలేదన్నారు. తాను కూడా పవన్‌ని వైసీపీలోకి ఆహ్వానిస్తే బాగుంటుందా అని ప్రశ్నించారు.
ఏపీలో రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో ప్రచారాలపై ఫోకస్ పెట్టారు. తాను పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రచార రూట్ మ్యాప్ షెడ్యూల్‌ను ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు వర్సెస్ మాజీ జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజుగా రాజకీయాలు మారిపోయాయి. మద్దిపాటికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో ముళ్లుపూడి వర్గీయులు నిరసనలు చేస్తున్నారు.