జగన్ ను కలిసిన ముద్రగడ
ఏపీ మాజీ సీఎం, వైసీపీ మాజీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను ఆ పార్టీ నేతలు ముద్రగడ పద్మనాభం, కాసు మహేష్ రెడ్డి తదితరులు ఈ రోజు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో కలిశారు. ఎన్నికల అనంతర పరిణామాలతో పాటు పలు రాజకీయ అంశాలను చర్చించారు.
ఏపీ మాజీ సీఎం, వైసీపీ మాజీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను ఆ పార్టీ నేతలు ముద్రగడ పద్మనాభం, కాసు మహేష్ రెడ్డి తదితరులు ఈ రోజు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో కలిశారు. ఎన్నికల అనంతర పరిణామాలతో పాటు పలు రాజకీయ అంశాలను చర్చించారు.
AP: కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనపై కేసు నమోదు చేశారు. కాకినాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ద్వారంపూడితో పాటు 24 మంది కేసు నమోదు అయింది. A1గా ద్వారంపూడి, A2గా బళ్ల సూరిబాబు పేర్లను చేర్చారు.
పీసీబీ ఫైల్స్ దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా తీశారు. కృష్ణా కరకట్టపై రికార్డులను దగ్ధం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్ధం చేసిన ఫైల్స్, రిపోర్టులకు సంబంధించిన వివరాలను తక్షణమే అందించాలని ఆదేశించారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
పిఠాపురం వారాహి సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఇందులో తన సినిమాలకు సంబంధించి ప్లాన్ ఎలా ఉండబోతుందో చెప్పారు. 'ప్రస్తుతం సినిమాలు తీసే సమయం ఉందా..? మీకు మాటిచ్చాను కాబట్టి మూడు నెలలు సినిమా షూటింగ్స్ పెట్టుకోను' అని అన్నారు.
AP: పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్థలం కొని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలు రెండు బిట్లు కొనుగోలు చేశారు.
నియోజకవర్గంలో 3 ఎకరాల భూమి కొని తాను పిఠాపురం వాస్తవ్యుడిగా మారానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసమే తాను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నట్లు తెలిపారు. పిఠాపురంలో సెరీకల్చర్ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
9 నెలలుగా మిస్సైన బిడ్డను ఇంటికి చేర్చిన పవన్ కల్యాన్ కు జీవితాంతం రుణపడి ఉంటానని బాధితురాలు తల్లి శివకుమారి చెప్పారు. పవన్, పోలీసులకు ధన్యవాదాలు. నా బిడ్డతో కలిసి పవన్ ను కలుస్తా. నాలాంటి తల్లుల బాధలు కూడా తీర్చండి' అని కోరింది.
భీమవరానికి చెందిన బాలిక మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంజద్ తనకు నెల రోజులు తిండిపెట్టలేదని, 9 నెలలుగా 5 రాష్ట్రాలు తిప్పుతూ చిత్రహింసలకు గురిచేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
AP: పిఠాపురం నియోజకవర్గం, నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఉప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్తూ గ్రామ గ్రామాన ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు.