Rajahmundry Event anchor: లవర్‌పై అనుమానం.. తల్లీకూతుళ్లను పొడిచి చంపిన యువకుడు

భర్త చనిపోయిన మహిళతో శివకుమార్‌కు వివాహేతర సంబంధం ఉంది. ఈమెంట్‌లో యాంకర్‌గా పని చేస్తున్న సల్మాతో వేరే వ్యక్తితో మాట్లాడుతుందని అనుమానంతో లైట్‌మ్యాన్ శివ గొడవ పడ్డాడు. ఆవేశంలో ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. సల్మా కూతురు సానియాని కూడా చంపేశాడు.

New Update

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దారుణం వెలుగు చూసింది. ఈమెంట్‌లో యాంకర్‌గా పని చేసే సల్మాతోపాటు ఆమె కూతురు సానియా కూడా అప్పుడప్పుడు పనికి వస్తుండేది. సానియా తండ్రి, సల్మా భర్త అబ్దుల్ మజీద్‌ కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అదే ఈవెంట్ టీంలో పని చేస్తున్న లైట్‌మెన్ శివకుమార్‌ సానియాతో లవ్ ట్రాక్ నడిపించాడు. సానియా మరో వ్యక్తితో మాట్లాడుతుందని శివ కుమార్ అనుమానించాడు. శివ కుమార్‌ది శ్రీకాకుళం జిల్లా నందిగాం. అతను నాలుగు రోజుల నుంచి సల్మా ఇంట్లోనే గడిపాడు. 

Also read: Eknath Shinde: ఏక్ నాథ్ షిండేపై జోక్స్.. కమిడియన్‌పై కేసు నమోదు

సానియా వేరే వ్యక్తితో ఫోన్ మాట్లాడుతుందని శివ ఆమెతో వివాదానికి దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి ఆవేశంలో శివ సానియాను కత్తితో పొడిచి చంపేశాడు. అడ్డువచ్చిన ఆమె తల్లి సల్మాను కూడా యువకుడు దారుణంగా చంపేశాడు. మజీద్‌కు సల్మా రెండో భార్య, వీరిద్దరి సానియా జన్మించింది. శివకుమార్ సల్మా కూతురు సానియాను కూడా కత్తితో పొడిచి చంపాడు. తల్లి, కుమార్తెను చంపి నిందితుడు ఇంటికి తాళం వేసి పారిపోయాడు. పోలీసులు కొవ్వూరు సమీపంలో శివను అరెస్టు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment