ఒక్కటైన ప్రేమ జంట.. స్కూటీపై దువ్వాడ-మాధురి రైడింగ్!

వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్- దివ్వెల మాధురి ప్రేమ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. భార్య వాణితో విభేదాల తర్వాత పర్మనెంట్‌గా మాధురితోనే ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం మాధురిని స్కూటీపై ఎక్కించుకుని రోడ్లపై చక్కర్లు కొట్టారు. వీడియో వైరల్ అవుతోంది.

New Update
mmmm

Dhuvvada-Madhuri: వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్- దివ్వెల మాధురి ప్రేమ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. భార్య వాణితో విభేదాల తర్వాత పర్మనెంట్‌గా మాధురితోనే ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం మాధురిని స్కూటీపై ఎక్కించుకుని రోడ్లపై చక్కర్లు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. స్కూటీపై షికార్లు చేస్తున్న ప్రేమ జంటను చూస్తుంటే ముచ్చటేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది వీరిద్దరిపై దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. భార్య వాణికి దువ్వాడ శ్రీనివాస్ షాక్ ఇచ్చారు. తను ఉంటున్న ఇంటిని దువ్వాడ మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు.  దువ్వాడ ఉంటున్న ఇల్లు నాదే అంటూ దివ్వెల మాధురి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు బయటపెట్టింది. దీంతో ఇంటి దగ్గర బంధువులతో కలిసి దువ్వాడ వాణి ఆందోళన చేపట్టింది. సీసీ కెమెరాలు పగలగొట్టి, తలుపు ధ్వంసం చేసింది. మాధురికి ఇంట్లో ఉంటే హక్కు లేదని నిరసన చేపట్టింది. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.

ఇలా ఇంటి దగ్గర మళ్లీ రచ్చ మొదలైంది. మరోవైపు ఇంట్లోకి దువ్వాడ వాణి వెళ్లొచ్చని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉత్తర్వుల్ని టెక్కలి పోలీసులకి ఇచ్చిన దువ్వాడ వాణి.. పోలీసులతో కలిసి దువ్వాడ ఇంటికొచ్చింది. అయితే, వారిని ఇంట్లోకి అనుమతించకపోవడంతో ఇంటి బయట దువ్వాడ భార్య, కూతుళ్లు గొడవకి దిగారు. దువ్వాడ ఇంటికి చేరుకుంటున్న బంధువులు వాణిని, కూతుళ్లను ఇంట్లోకి రానివ్వాలంటూ ఆందోళన చేపట్టారు. ఇంటి బయట భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ

అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

New Update

అఘోరీ, శ్రీవర్షిణీ లవ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో 14 రోజుల పాటు చంచల్‌గూడ జైల్లోకి పంపారు. అయితే అఘోరీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో.. ఆ తర్వాత శ్రీవర్షిణీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరీతో పాటే తనను కూడా అరెస్టు చేయాలని కోరింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

బోరున ఏడ్చేసిన వర్షిణి

అంతేకాకుడా తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వర్షిణీ అస్సలు వినిపించుకోలేదు. అఘోరీని జైలుకు పంపిన తర్వాత వర్షిణీకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వర్షిణికి పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తాను మైనర్‌ని కాదని.. మేజర్‌నని.. ఎక్కడైనా ఉండే హక్కు తనకు ఉందని వర్షిణి అంటోంది. తాను కావాలనుకున్న చోటుకే తనను వదిలేయాలని చెబుతోంది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

 

ఇందులో భాగంగానే వర్షిణికి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూన్నా ఆమె మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. అయితే పోలీసులు దాదాపు 15 రోజుల పాటు వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు తమ కూతురిని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అఘోరీ మాయమాటలకు వర్షిణి లోబడిందని.. తమ కూతురిని తామే ఇంటికి తీసుకెల్లిపోతామని అంటున్నారు.   

aghori sri varshini | lady aghori sri varshini relation | Lady Aghori Sri Varshini Marriage | Lady Aghori Sri Varshini Love Story | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment